हिन्दी | Epaper

Anupama Parameswaran: అనుపమ, సురేశ్ గోపి సినిమాకు సెన్సార్ బోర్డు నిరాకరణ

Ramya
Anupama Parameswaran: అనుపమ, సురేశ్ గోపి సినిమాకు సెన్సార్ బోర్డు నిరాకరణ

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ – టైటిల్, పాత్రపేరు చుట్టూ వివాదం

మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) మరియు కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడం పెద్ద దుమారానికే దారి తీసింది. సినిమాకు ‘జానకి’ అనే పేరు పెట్టడం, అదే పేరుతో లైంగిక దాడికి గురైన మహిళ పాత్రను చూపించడం సెన్సార్ బోర్డుకు సముచితంగా అనిపించలేదని, అందుకే వారు సర్టిఫికెట్ మంజూరు చేయడాన్ని నిరాకరించినట్లు సమాచారం.

ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జానకి అనే ఓ మహిళ సాగించే న్యాయ పోరాటం నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అయితే, సీతాదేవికి మరో పేరైన ‘జానకి’ (Janaki) అనే పేరును లైంగిక దాడికి గురైన మహిళ పాత్రకు పెట్టడంపై సెన్సార్ బోర్డు (Sensor Board) అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ నారాయణ్ కూడా ధృవీకరించారు. సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించిందని ఆయన వెల్లడించారు.

సెన్సార్ బోర్డు అభ్యంతరం – క్రియేటివ్ ఫ్రీడమ్‌పై ప్రశ్నలు

ఈ అంశంపై ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. సినిమాలో ‘జానకి’ (Janaki) అనే పేరును వాడకూడదని సెన్సార్ బోర్డు (Sensor Board) చిత్ర నిర్మాతలకు స్పష్టంగా తెలిపిందని ఆయన అన్నారు. సినిమా టైటిల్‌తో పాటు, ప్రధాన పాత్ర పేరును కూడా మార్చాలని బోర్డు సూచించిందని ఉన్ని కృష్ణన్ వివరించారు. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టడం తగదని బోర్డు భావించినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో మరో మలయాళ సినిమా విషయంలోనూ ఇలాంటి సమస్యే తలెత్తిందని, అప్పుడు ‘జానకి’ అనే పేరును ‘జయంతి’గా మార్చి సెన్సార్ సర్టిఫికెట్ పొందారని ఆయన గుర్తుచేశారు.

విడుదలకు ముందే చిక్కుల్లో చిత్రబృందం

‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయాలని చిత్రబృందం తొలుత ప్లాన్ చేసింది. “సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది” అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం, సామాజికంగా ప్రాధాన్యత కలిగిన అంశాన్ని సెన్సిటివ్‌గా చూపించనుంది. ఇందులో సురేశ్ గోపి న్యాయవాది పాత్రలో కనిపించనుండగా, అనుపమ ప్రధాన పాత్రగా మెరవనున్నారు. అయితే టైటిల్, పాత్ర పేరులపై మార్పులు లేకపోతే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ నారాయణ్, నిర్మాతలు ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Read also: Peddi: ఉత్కంఠ రేపుతున్న చరణ్ ‘పెద్ది’ సినిమా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

“ఆయన పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్”: ఆర్జీవీ

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

📢 For Advertisement Booking: 98481 12870