నటి అనసూయ(Anasuya Bharadwaj) తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్(heroine) అనే పదానికి కొత్త అర్థాన్ని ఆమె తన మాటల ద్వారా వెల్లడించారు. తెరపై అందంగా కనిపించే నటి మాత్రమే హీరోయిన్ కాదని, నిజం చెప్పే ధైర్యం ఉన్నవారు, తమ నిర్ణయాలపై నిలబడే శక్తి కలిగినవారు, అన్యాయానికి ఎదిరించే గుండె ఉన్నవారే నిజమైన హీరోయిన్లు అని అనసూయ పేర్కొన్నారు.
Read also: Meenakshi Chaudhary: పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటి మీనాక్షి

సరైన దారి కోసం పోరాడే వ్యక్తిత్వమే అసలైన శక్తి అని, మిగతా వారంతా కేవలం పాత్రలు పోషించే నటులే అనే భావనను ఆమె ఈ పోస్ట్ ద్వారా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి. కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: