దక్షిణాది చిత్ర పరిశ్రమలో(South IndianCinema) ఎన్నో సంవత్సరాలుగా లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన నయనతారకు ఇప్పుడు రష్మిక మందన్న నుంచి గట్టి పోటీ ఎదురవుతోందన్న చర్చలు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక, తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.
Read Also: Hollywood: ‘ది లయన్ కింగ్’ కో డైరెక్టర్ రోజర్ అల్లర్స్ ఇకలేరు

‘పుష్ప’ సినిమా ఘన విజయం తర్వాత రష్మిక పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పాన్ ఇండియా గుర్తింపు రావడంతో పాటు, హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ కమర్షియల్, కంటెంట్ ఆధారిత చిత్రాలతో బిజీగా కొనసాగుతోంది. దక్షిణాదిలో(South IndianCinema) టాప్ హీరోలతో సినిమాలు చేస్తూనే, అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ల జాబితాలో రష్మిక స్థానం సంపాదించింది. ఇదే సమయంలో కథకు ప్రాధాన్యం ఉన్న లేడీ సెంట్రిక్ పాత్రలపైనా ఆసక్తి చూపుతూ తన ఇమేజ్‌ను మరింత బలపరుచుకుంటోంది.
ఈ వేగం, క్రేజ్ ఇదే స్థాయిలో కొనసాగితే, భవిష్యత్తులో నయనతారకు ఉన్న ప్రత్యేక స్థానానికి రష్మిక గట్టి సవాల్ విసురుతుందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. అయితే, అనుభవం, ఎంపికల విషయంలో నయనతారకు ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉందని మరికొందరు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: