Payal Rajput : ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు : పాయల్ ఆర్ఎక్స్100 సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పాయల్ రాజ్ పుత్… ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.”నటులుగా కెరీర్ ప్రారంభించడం ఎంతో కష్టం. ప్రతి రోజూ ఏదో ఒక అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుంది. బంధుప్రీతి, వివక్ష రాజ్యమేలుతున్న ఈ పరిశ్రమలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం సులభం కాదు” అని పాయల్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.సినీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు సులభంగా దక్కుతున్నాయని, కొత్తగా వచ్చిన వాళ్లు ఎంత టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు రావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. “ఈ రంగంలో నా శ్రమ అంకితభావం నిజంగా ఫలితాన్ని ఇస్తాయా అని నాకు అనుమానం కలుగుతోంది. ప్రఖ్యాతి పొందిన కుటుంబాల వారసులు మేనేజర్లు ఉన్న వారికి అవకాశాలు కట్టుకథలుగా వస్తున్నాయి. నా ప్రతిభతో నేను నిలదొక్కుకోవచ్చా అని నాలో చాలా సందేహాలు ఉన్నాయి.

నటులుగా ఉండడం కంటే కఠినమైన జీవితం ఇంకేముంటుందో! ప్రతి రోజూ అనిశ్చితి, ఎందుకంటే ఇక్కడ బంధుప్రీతి, పక్షపాతం ప్రధానంగా ఉంటాయి” అని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తపరిచారు.పాయల్ చేసిన ఈ వ్యాఖ్యలకు నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. సినీ పరిశ్రమలో ఎవరి అండదండా లేకుండా వచ్చిన నటీనటులు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నారని వారసులకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. “టాలెంట్ ఉంటే ఎవరైనా రాణించవచ్చు కానీ ఈ పరిశ్రమలో సరైన అవకాశాలు దొరకడం చాలా మందికి కష్టమే” అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పాయల్ చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “ప్రతిభ ఉంటే ఎవరి అండ లేకుండా కూడా ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవచ్చు. అవకాశాలు రావడం వ్యక్తిగత నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది” అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, పాయల్ లాంటి కొత్త నటీనటులకు సరైన అవకాశాలు కల్పించాలని, టాలెంట్ ఆధారంగానే సినిమాలు నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఇంకొంత మంది అభిప్రాయపడుతున్నారు.పాయల్ రాజ్ పుత్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు పరిశ్రమలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోతే, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారికిది నిరుత్సాహకరమైన పరిస్థితి అవుతుందని పలువురు అంటున్నారు. మరి, ఈ అంశంపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పంది