हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

హీరోయిన్ రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్..

Divya Vani M
హీరోయిన్ రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్..

దక్షిణాది చిత్రసీమలో రాశి ఖన్నా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే, ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ పై తన దృష్టిని కేంద్రీకరించింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా సౌత్ ఇండియన్ అభిమానుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ, “సౌత్ అభిమానులు సినిమా విడుదలను పండగలా చేసుకుంటారు. సినిమా రిలీజ్ సమయంలో అన్నం తినడం కూడా మర్చిపోతారు. సినిమాలపై వారి ప్రేమ నిజంగా అమోఘం” అని పేర్కొంది.

Raashii Khanna
Raashii Khanna

రాశి ఖన్నా తెలుగు సినిమాతో నటిగా కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల ఆమె సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ‘అచో అచో’ సినిమాలో తమన్నాతో కలిసి ప్రత్యేక గీతంలో మెరిసింది. అలాగే, తమిళంలో జీవా సరసన బి. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అగతీయ’ సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదల కానుంది.2018లో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ‘ఇమైక్క నోడిగల్’ చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టిన రాశి, ఆ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత రవి దర్శకత్వంలో వచ్చిన ‘అడంగమారు’ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించింది.

ఇక, 2013లో షూజిత్ సర్కార్ దర్శకత్వంలో వచ్చిన ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది.రాశి ఖన్నా గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నాకు చిన్నప్పుడు ఐఏఎస్ కావాలని ఆశయం ఉండేది.కానీ మోడలింగ్‌పై ఆసక్తి పెరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టాను” అని చెప్పింది. ప్రస్తుతం రాశి ఖన్నా తన కెరీర్‌ను బాలీవుడ్ పై దృష్టి పెట్టి కొనసాగిస్తోంది.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తన ప్రతిభను చాటుతూ, రాశి ఖన్నా సినీ పరిశ్రమలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ‘అగతీయ’ సినిమాతో మరింత మెప్పించనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870