నటి (Actress) రేణు దేశాయ్ హైదరాబాద్‌లోని(Hyderabad) సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో, కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. అయితే, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, మూగజీవులపై జరుగుతున్న హింసపై తాను నిత్యం స్పందిస్తూనే ఉంటానని తెలిపారు. వీధి కుక్కల నిర్మూలన చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. వీటిని హత్యలుగా అభివర్ణిస్తూ, చిన్నపిల్లలను కరుస్తున్నాయనే కారణంతో కుక్కల పట్ల క్రూరంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
Read Also: Bandla Ganesh: ఆ వెంకన్న ఆశీస్సులు గణేష్ కు ఉండాలి..

కుక్కల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా
లక్షల మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక చనిపోతున్నారని, దాని కోసం ఎవరూ పోరాడడం లేదని, కానీ కుక్కలు కరిస్తే పోరాటాలు చేస్తున్నారని రేణు దేశాయ్ అన్నారు. (Actress) ప్రతిరోజు తాను కుక్కలను కాపాడుతున్నానని, వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నానని ఆమె చెప్పారు.
ఇప్పటికే ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో కుక్కలు యాక్సిడెంట్లలో చనిపోతున్నాయని.. బైక్, బస్సులు, కార్లు తగిలి కుక్కలకు తీవ్ర గాయాలు తగులుతున్నాయని.. వాహనదారుల వల్లే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని కుక్కలు వెళ్లి కంప్లెయింట్ చేయలేవు కదా? అని ఆమె అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: