తెలుగు సినీరంగంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగింది. బొమ్మరిల్లు, సాంబ, నా అల్లుడు, ఆరెంజ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ సినీప్రియులను ఆకట్టుకుంది. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాల్లో నటించింది. కానీ కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది జెనీలియా డిసౌజా (Genelia D’Souza). బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Read also: Satya: ‘జెట్లీ’ సినిమా గ్లింప్స్ చూసారా?

జంతు ప్రేమికురాలిగా మారడం
సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇప్పుడు, పూర్తిగా వేగన్‌గా మారినట్లు నటి జెనీలియా డిసౌజా )(Genelia D’Souza) వెల్లడించారు. 2017లో మాంసాహారం నుంచి శాకాహారానికి మారిన ఆమె, 2020లో పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం ప్రారంభించారు.
తన భర్త రితేష్ దేశ్‌ముఖ్ ప్రోత్సాహంతో ఈ మార్పు జరిగిందని, మొదట్లో పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకున్నా, ఇప్పుడు వాటిని కూడా మానేశానని తెలిపారు. ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశ్యంతోనే ఈ జీవనశైలిని అవలంబించానని, జంతు ప్రేమికురాలిగా మారడం తనకు ఆనందాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: