हिन्दी | Epaper

Nandamuri TarakaRatna: తారకరత్న వర్ధంతి: సాయిరెడ్డి భావోద్వేగ ట్వీట్

Pooja
Nandamuri TarakaRatna: తారకరత్న వర్ధంతి: సాయిరెడ్డి భావోద్వేగ ట్వీట్

Nandamuri TarakaRatna: టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మూడో వర్ధంతి నేడు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా 2023 ఫిబ్రవరి 18న కుప్పానికి వచ్చిన ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు ప్రాణాలను కాపాడలేకపోయారు.

Read Also:Bollywood Actor: సిద్ధార్థ్ మల్హోత్రాకి పితృవియోగం

Nandamuri TarakaRatna
Nandamuri TarakaRatna: Tarakaratna’s death anniversary: ​​Sai Reddy’s emotional tweet

తారకరత్నను గుర్తు చేసుకున్న విజయసాయిరెడ్డి

ఆ సమయంలో ఆయనకు దగ్గరి బంధువైన అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను ఓదార్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తారకరత్న మూడో వర్ధంతి సందర్భంగా విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశారు. తారకరత్న చాలా త్వరగా మన మధ్య నుంచి వెళ్లిపోయారని, ఆయన ఆప్యాయత, వినయం, అంకితభావం అనేక మంది జీవితాలను ప్రభావితం చేశాయని గుర్తు చేశారు. ఆయన మరణం కలిగించిన షాక్, అభిమానుల హృదయాల్లో ఏర్పడిన ఖాళీ ఇప్పటికీ గుర్తుందని పేర్కొన్నారు. తారకరత్నను ఎప్పటికీ మిస్ అవుతామని, ప్రేమగా గుర్తుంచుకుంటామని ట్వీట్‌లో తెలిపారు.

తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. ఆయన ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణకు ఏకైక కుమారుడు. ఒకేసారి తొమ్మిది సినిమాలతో టాలీవుడ్‌లో అరుదైన ఎంట్రీ ఇచ్చి వరల్డ్ రికార్డు సృష్టించారు. కేవలం 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆయన కన్నుమూయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్, వధువు ఎవరో తెలుసా?

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్, వధువు ఎవరో తెలుసా?

ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

📢 For Advertisement Booking: 98481 12870