బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ (Salman Khan) గురించి ప్రేమ వ్యవహారాల చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఎన్నో పేర్లు వినిపించినా, ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉన్న ఈ స్టార్ హీరో తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో (On ‘The Great Indian Kapil Show’) తన ప్రేమ జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.ఈ షోలో కమెడియన్ కపిల్ శర్మ సరదాగా “మీ గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దదేమో” అని అడిగినప్పుడు, సల్మాన్ సీరియస్‌గా స్పందించాడు. నిజం చెబుతున్నా.. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఎప్పటికీ ఎక్కువగా లేరు. మొత్తం ముగ్గురు లేదా నలుగురే ఉన్నారు. కానీ వాళ్లతో బంధం ఏడేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకూ కొనసాగింది అని చెప్పాడు.
నేటి ట్రెండ్ నాకు అంతగా నచ్చదు
సల్మాన్ తాను ఓల్డ్ స్కూల్ అని చెబుతూ, “ఇప్పటి కాలం ప్రేమలు చాలా తక్కువ కాలం నిలుస్తున్నాయి. ఒకరినొకరు మార్చుకోవడం చాలా కామన్ అయిపోయింది. కానీ నాకు అలాంటివి నచ్చవు. నా సంబంధాలు తక్కువే కానీ లోతుగా ఉంటాయి” అని వివరించాడు.
పెళ్లి విషయంపై మళ్లీ ఆసక్తికర చర్చ
సల్మాన్ ఈ వయసులో కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్న అభిమానుల్లో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. తాను ప్రేమలో నెమ్మదిగా, నిశ్చలంగా ముందడుగు వేస్తానని చెప్పిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఆ డౌట్‌కు హింట్ ఇచ్చినట్లయ్యాయి. తాను ఇప్పటికీ ఒంటరిగా ఉన్నా, ప్రేమను చిన్నగా చూసే వాడు కాదని స్పష్టం చేశాడు.
తాజాగా రష్మికతో ‘సికందర్’లో నటించిన సల్మాన్
ప్రముఖ హీరోయిన్లతో తెరపై అద్భుత కెమిస్ట్రీ చూపిన సల్మాన్, 36 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో బ్లాక్‌బస్టర్‌లతో మెప్పించాడు. ప్రస్తుతం రష్మిక మందన్నతో కలిసి నటిస్తున్న ‘సికందర్’ చిత్రం కోసం సల్మాన్ బిజీగా ఉన్నాడు. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం తాను ఎప్పటికీ ప్రేమను సీరియస్‌గా తీసుకున్నానని ఈ షోలో చెప్పిన వ్యాఖ్యలు మరోసారి రుజువయ్యాయి.
Read Also : World Rainforest Day: నేడు ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డే