‘పుష్ప’ సినిమాతో(Indian Cinema) అల్లు అర్జున్‌కు నార్త్ ఇండియాలో భారీ గుర్తింపు వచ్చింది. దక్షిణ భారతంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటకలో ఆయనకు గట్టి ఫ్యాన్‌బేస్ ఉంది. ఇక మిగిలిన ప్రధాన మార్కెట్ తమిళనాడు కావడంతో, అక్కడి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని బన్నీ తన తదుపరి అడుగులు వేస్తున్నాడనే చర్చ వినిపిస్తోంది.
Read Also: Samantha: కొత్త బ్రాండ్ ఆవిష్కరించిన నటి

అట్లీ, లోకేశ్ కనగరాజ్‌తో ప్రాజెక్ట్‌లతో బన్నీ పాన్–ఇండియా వ్యూహం
ఈ క్రమంలో తమిళ సినీ పరిశ్రమకు(Indian Cinema) చెందిన స్టార్ దర్శకులు అట్లీ, లోకేశ్ కనగరాజ్‌లతో సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీరు తమిళ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉన్న దర్శకులు కావడంతో, ఈ సినిమాలు తమిళనాడులో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లు విజయం సాధిస్తే, అల్లు అర్జున్‌కు పాన్–ఇండియా స్థాయిలో మరింత బలమైన స్థానం దక్కుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: