हिन्दी | Epaper

Allu Arjun : షారుక్ ఖాన్, రాణి ముఖర్జీకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు

Divya Vani M
Allu Arjun : షారుక్ ఖాన్, రాణి ముఖర్జీకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిసింది. సినీ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు విజేతలను హృదయపూర్వకంగా అభినందించారు.గతేడాది ‘పుష్ప’ చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , ఈసారి విజేతలైన షారుఖ్ ఖాన్, విక్రాంత్ మస్సే, రాణీ ముఖర్జీలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘జవాన్’ చిత్రంలో అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న షారుఖ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ, 33 ఏళ్ల సినీ ప్రస్థానంలో మీకు దక్కిన ఈ గౌరవం అర్హమైనది. ఇది మీ విజయాల్లో మరో మైలురాయి, అని బన్నీ పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన దర్శకుడు అట్లీకి కూడా ఆయన అభినందనలు తెలిపారు.

Allu Arjun : షారుక్ ఖాన్, రాణి ముఖర్జీకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు
Allu Arjun : షారుక్ ఖాన్, రాణి ముఖర్జీకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు

విక్రాంత్ మస్సేకు బన్నీ నుండి హృదయపూర్వక అభినందనలు

‘12త్ ఫెయిల్’ చిత్రానికి గాను షారుఖ్‌తో కలిసి ఉత్తమ నటుడి అవార్డు పంచుకున్న విక్రాంత్ మస్సేను కూడా అల్లు అర్జున్ అభినందించారు. “విక్రాంత్ మస్సే గారికి శుభాకాంక్షలు. ‘12త్ ఫెయిల్’ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. నీ విజయం పూర్తిగా అర్హమైనది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది,” అని తన పోస్టులో రాశారు.

రాణీ ముఖర్జీపై బన్నీ ప్రశంసలు

ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న రాణీ ముఖర్జీకి కూడా బన్నీ శుభాకాంక్షలు (Bunny also wishes Rani Mukherjee) తెలిపారు. ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రంలో ఆమె నటనను ప్రత్యేకంగా కొనియాడారు. జాతీయ అవార్డులు అందుకున్న కళాకారులు, సాంకేతిక నిపుణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, “ఇది భారతీయ సినిమాకు గర్వకారణమైన క్షణం,” అని అన్నారు.

కమల్ హాసన్ నుంచి ప్రశంసల జల్లు

లోకనాయకుడు కమల్ హాసన్ కూడా జాతీయ అవార్డుల విజేతలను అభినందించారు. షారుఖ్ ఖాన్‌కు ఈ గౌరవం ఎప్పుడో రావాల్సిందని అన్నారు. అలాగే, ‘12త్ ఫెయిల్’ తనను ఎంతగానో కదిలించిన అద్భుత చిత్రం అని పేర్కొన్నారు. రాణీ ముఖర్జీ నటనను కూడా ఆయన ప్రశంసించారు.ఈ అవార్డులు భారతీయ సినిమాకు మరింత గౌరవం తెచ్చాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. షారుఖ్ ఖాన్, విక్రాంత్ మస్సే, రాణీ ముఖర్జీ విజయాలు పరిశ్రమకు స్ఫూర్తిదాయకం అవుతున్నాయి.

Read Also : Chandrababu : రైతుల కు‘అన్నదాత సుఖీభవ’కు చంద్రబాబు శ్రీకారం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

వృద్ధ అభిమానిని చూసి చలించిన రణవీర్.. పాదాలకు నమస్కారం

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

రికార్డు స్థాయిలో అమ్ముడైన ధురంధర్ 2 టికెట్లు!

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

శ్రీదేవి ఆస్తి వివాదం.. మద్రాస్ హైకోర్టు వరకు

రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

ధనుష్ D56 సినిమా, హీరోయిన్‌గా రుక్మిణి టాక్

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

📢 For Advertisement Booking: 98481 12870