Ajith kumar : ప్రముఖ తమిళ సినీ నటుడు అజిత్‌కు మహీంద్రా సంస్థ ప్రత్యేక బహుమతి అందించింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మహీంద్రా బీఈ6 ఫార్ములా ఈ-థీమ్‌డ్ ఎస్‌యూవీ కారును ఆయనకు బహూకరించింది.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన మోటార్ స్పోర్ట్స్ కార్యక్రమాల నుంచి చెన్నైకి తిరిగి వచ్చిన అజిత్‌ను మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ మరియు ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ ఆర్. వేలుసామి స్వయంగా కలుసుకుని ఈ కారును అందించారు.
అజిత్‌కు రేసింగ్‌పై ప్రత్యేక ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. ఆయన కేవలం నటుడిగానే కాకుండా ప్రొఫెషనల్ రేసర్‌గా కూడా గుర్తింపు పొందారు. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనడానికి ఆయన తరచుగా విదేశాలకు వెళ్తుంటారు.
Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి

ఇటీవల మోటార్ రేసింగ్ పోటీల కోసం అజిత్ ఎక్కువగా దుబాయ్‌లోనే ఉన్నారు. రేసింగ్ పట్ల ఆయనకున్న అభిరుచిని గౌరవిస్తూ మహీంద్రా సంస్థ ఈ ప్రత్యేక ఎస్‌యూవీ కారును బహుమతిగా అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: