
Dubai Stranded Passengers: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన ప్రయాణాలు రద్దై దుబాయ్‌లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ క్లిష్ట సమయంలో బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విదేశీ గడ్డపై ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు.
Read Also: Sangeetha Vijay: విడాకుల వ్యవహారం.. రూ. 250 కోట్ల భరణం ఆఫర్..
ఉచిత వసతి.. షరతులు లేవు!
దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఏ దేశస్థులకైనా ఎటువంటి షరతులు లేకుండా ఉచితంగా వసతి (Accommodation) కల్పించనున్నట్లు సోనూసూద్ వెల్లడించారు. “ఈ సమయంలో మానవత్వం మాత్రమే ముఖ్యం. ఎక్కడైనా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా బృందాన్ని సంప్రదించండి” అని ఆయన పిలుపునిచ్చారు. ప్రయాణికులు తనను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదిస్తే, తన వాలంటీర్ల బృందం వెంటనే సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. గతంలో కరోనా సమయంలో వలస కార్మికులకు సహాయం చేసిన సంగతి తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: