ధూమపాన ప్రియులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం చేదువార్త చెప్పబోతోంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి. పన్ను ఆదాయం తగ్గకుండా చూసుకునేలా, ప్రజలను ధూమపానం నుంచి మరింత దూరం చేయాలనే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచే యోచనలో ఉంది.
జీఎస్టీ పెంపు
ప్రస్తుతం సిగరెట్లపై 28% జీఎస్టీ విధిస్తున్న కేంద్రం, అదనంగా ఇతర ఛార్జీలను కలిపి మొత్తం 52% పన్నులను వసూలు చేస్తోంది. అయితే త్వరలోనే ఈ జీఎస్టీని 28% నుంచి 40%కి పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంపునకు సంబంధించి సమీక్ష జరుపుతోంది. తుది నిర్ణయం తీసుకునే ముందు, దీనిపై తమ సిఫార్సులను సమర్పించనున్నారు.
పరిహార సెస్
ప్రస్తుతం సిగరెట్లపై విధిస్తున్న పరిహార సెస్ 2026 మార్చితో ముగియనుంది. అయితే, ఆ సెస్ ముగిసిన తర్వాత పన్ను ఆదాయాన్ని తగ్గించకుండా చూసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. సిగరెట్లపై కొత్త సెస్ విధించే ఆలోచనలో మాత్రం ప్రభుత్వం లేదు. అందుకే, ప్రత్యక్షంగా జీఎస్టీ పెంపుపై దృష్టి పెట్టింది.అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా పొగాకు, సిగరెట్లపై జీఎస్టీ ధరలను పెంచబోతుంది. జీఎస్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలోని మంత్రుల ప్యానెల్ ప్రస్తుతం ఈ అంశాన్ని సమీక్షిస్తోంది. తుది నిర్ణయం తీసుకునే ముందు దాని సిఫార్సులను సమర్పించే అవకాశం కూడా ఉంది.

ధరలు భారీగా పెరిగే అవకాశం
సిగరెట్లు ఆరోగ్యానికి హానికరమన్నదే కాదు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రధాన కారణమన్నది అందరికీ తెలిసిన సంగతే. ధూమపానం వల్ల ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న ఉద్దేశ్యంతో,వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే వీటిపై భారీ పన్నులు విధిస్తున్నారు. జీఎస్టీతో పాటు ఎక్సైజ్ డ్యూటీ, విపత్తుల కంటింటెంజ్ డ్యూటీలు కూడా అమల్లో ఉన్నాయి.ప్రస్తుతం మన దేశంలో సిగరెట్లపై 53% పన్ను ఉంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 75% కన్నా ఎక్కువ. 2022-2023లో పొగాకు ఉత్పత్తుల వల్ల రూ.72,788 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇదిలా ఉండగా పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ ప్రస్తుతం 5 శాతంగా ఉండగా.. దీనితో పాటు 1000 సిగరెట్లకు వాటి పొడవు, ఫిల్టర్, రుచి ఆధారంగా రూ.2,076 నుంచి రూ.4,170 వరు అదనపు నిర్ధిష్ట లెవీ విధించబడుతోంది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులపై పన్నును సమీక్షించేందుకు జీఎస్టీ కౌన్సిల్ గతంలో అప్పటి ఒడిశా ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీళ్లే జీఎస్టీ ధరల పెంపను పరిశీలిస్తున్నారు. చూడాలి మరి ఏ జరగనుంది అనేది.