దాదాపు 4 ఏళ్ల కిందట చైనా నుంచి ప్రపంచానికి విస్తరించిన కరోనా వైరస్ పెద్ద విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. చైనా నగరం ఊహాన్ నుంచి ప్రపంచ నలుమూలలకు విస్తరించిన వైరస్ ప్రజల ప్రాణాలతో పాటు వారి ఆర్థిక మూలాలను కూడా భారీగా దెబ్బతీసింది. ఈ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు మరోసారి ఆందోళనలు మెుదలయ్యాయి.
గబ్బిల కరోనావైరస్‌గా గుర్తింపు
తాజాగా చైనా పరిశోధకుల బృందం HKU5-CoV-2 అనే వైరస్ గబ్బిల కరోనావైరస్‌ను గుర్తించింది. ఇది జంతువుల నుండి మానవులకు సంక్రమించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో వ్యాప్తి చెందే అవకాశం గురించి ఆందోళనలను లేవనెత్తారు. ఈ వైరస్ కొవిడ్-19కి కారణమైన వైరస్ అయిన SARS-CoV-2 లాగా మనుషుల శరీరంలోకి వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉందని పరిశోధకులు వెల్లడించారు. కొత్తగా కనుగొనబడిన వైరస్ మెర్బెకోవైరస్ ఉపజాతిలో భాగమని అధ్యయనంలో వెల్లడైంది.

ఆరోపణలను తోసిపుచ్చారు
గ్వాంగ్‌జౌ లాబొరేటరీ, గ్వాంగ్‌జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయం, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో సహా పరిశోధకుల బృందం ఇటీవల మంగళవారం పీర్-రివ్యూడ్ జర్నల్ సెల్‌లో తమ పరిశోధనలను సంబంధించిన వివరాలను పంచుకోవటంతో మరోసారి చైనా వైరస్ భయాలు బయటకు వచ్చాయి. కొవిడ్-19 పరిశోధనలో కీలక వ్యక్తి షి జెంగ్లీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని మహమ్మారికి అనుసంధానిస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు. షి జెంగ్లీతో పాటు అనేక మంది ఇతర శాస్త్రవేత్తలు వైరస్ సహజంగా ఉద్భవించిందని వాదించారు. కానీ కొవిడ్-19 మహమ్మారి సహజ మూలానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని తెలిసిందే.
స్టాక్ మార్కెట్లలో భయాలు
స్టాక్ మార్కెట్లలో భయాలు.. వాస్తవానికి 2019 సమయంలో కరోనా వైరల్ వ్యాప్తితో ప్రపంచం ఒక్కసారిగా స్థంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీ షేర్లను విక్రయించటానికి ప్రజలు ఇష్టపడటంతో అనేక విలువైన కంపెనీల షేర్లు సైతం భారీ పతనాన్ని కొనసాగించాయి. వందల లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. చాలా కంపెనీలు ఈ కాలంలో తమ వ్యాపారాలను మూసివేయటంతో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల నుంచి కనుమరుగైన పరిస్థితుల గురించి మనకు తెలిసిందే.