యుఎస్ లో ఉంటున్న భారతీయులు ట్రంప్ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్న ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే వలసదారులను దేశం నుంచి సాధ్యమైనంత వేగంగా బహిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్న ట్రంప్ సర్కార్, అమెరికా వీసా, గ్రీన్ కార్డు దారులపైన పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తోంది.
సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన నిఘా
ట్రంప్ నిర్ణయాలతో అందరికీ భయం ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రంప్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారి వీసాలు, గ్రీన్ కార్డులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన అమెరికా సర్కార్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన కూడా నిఘా పెంచింది. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో గ్రీన్ కార్డు హోల్డర్లు, హెచ్ వన్ బి వీసా దారులు, హెచ్ 4 వీసా దారులు, ఐ 140 ఉన్నవారు ప్రతి ఒక్కరు భయపడుతున్న పరిస్థితి ఉంది. వివిధ యూనివర్సిటీలలో చదువుకోడానికి అక్కడికి వెళ్లిన విద్యార్థులు ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న షాకింగ్ నిర్ణయాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎ

పెళ్ళిళ్ళ విషయంలో తలక్రిందులుగా పరిస్థితి
ట్రంప్ రాకతో పెళ్ళిళ్ళ విషయంలో తలక్రిందులుగా పరిస్థితి ఈ పరిస్థితి యూఎస్ లో ఉంటున్న వారి పెళ్లిళ్ల విషయంలో కూడా తీవ్ర సందిగ్ధతకు కారణంగా మారింది. నిన్న మొన్నటి వరకు యూఎస్ లో ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవాలంటే యూఎస్ లో ఉన్న అబ్బాయినో, అమ్మాయినో వెతుక్కొని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకునేవారు. ఉద్యోగాలకే భరోసా లేకుంటే పెళ్లి ఎలా? ఎవరి ఉద్యోగాలకు భరోసా లేని పరిస్థితుల్లో అబ్బాయిలు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడటం పైన విముఖతను వ్యక్తం చేస్తున్నారు.
Read Also: China tariff : శ్వేతసౌధం చర్యకు దీటుగా డ్రాగన్ స్పందన