తమిళనాడు రాష్ట్రంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తేనీలోని ఒక ప్రైవేటు షెల్టర్ హోమ్ లో ఓ చిన్నారిని చెత్త డబ్బాలో వేసి చిత్రహింసలు పెడుతూ భయభ్రాంతులకు గురిచేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలలోకి వెళితే…
పైశాచిక చర్యలు
చిన్నారికి చిత్రహింస.. వీడియో వైరల్ ఒక ప్రైవేటు పిల్లల హోమ్ లో ఒక పసిబిడ్డ ను చెత్త డబ్బాలో వేసి పైకి కిందికి ఊపుతూ ఆ డబ్బాను దొర్లిస్తున్నట్లుగా, ఇద్దరు సిబ్బంది చేసిన చర్యలు ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేశాయి. ఒకటిన్నర ఏళ్ల చిన్నారి భయపడుతూ ఏడుస్తున్న వదిలిపెట్టకుండా ఇద్దరు అమ్మాయిలు డస్ట్ బిన్ ను ఉయ్యాలలా ఊపుతూ చేసిన పైశాచిక చర్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డే కేర్ హోంలో దారుణ ఘటన
డే కేర్ హోంలో దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తేనిలో జేజే ప్రొజెడీస్ లో జరిగిన ఈ సంఘటనలో ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు సహజంగా పిల్లలను ఈ ప్రైవేట్ హోమ్ డే కేర్ హోంలో వదిలి వెళ్లి సాయంత్రం జాబ్ పూర్తయిన తర్వాత తిరిగి ఇళ్లకు తీసుకువెళ్తారు. ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత షెల్టర్ ఇస్తున్న సిబ్బంది పైన ఉంటుంది. ఈ హోం ను జెన్నీఫర్ అనే మహిళ నిర్వహిస్తోంది. చెత్తబుట్టలో చిన్నారిని ఉంచి భయభ్రాంతులకు గురి చేసిన సిబ్బంది అయితే ఈ హోమ్ లో జరిగినటువంటి దారుణ ఘటన అక్కడి సిబ్బంది పైశాచికత్వానికి నిదర్శనంగా నిలిచింది. పిల్లవాడిని పడేసినట్టు చెత్త డబ్బాలో వేసి అటు ఇటు ఊపుతూ పసికందు ఏడుస్తున్నా వదిలిపెట్టకుండా వారు పైశాచికానందాన్ని పొందారు. ఇది చూసిన ప్రతి ఒక్కరు తీవ్రంగా కలత చెందారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత జిల్లా బాలల రక్షణ విభాగానికి దీనిపైన ఫిర్యాదు చేశారు.
రంగంలోకి జిల్లా బాలల రక్షణ సిబ్బంది
రంగంలోకి జిల్లా బాలల రక్షణా విభాగం జిల్లా బాలల రక్షణ విభాగానికి సంబంధించిన సిబ్బంది హోమ్ ను సందర్శించి అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే గత నాలుగు నెలల క్రితమే ఈ వీడియో రికార్డు చేయబడిందని, కానీ ప్రస్తుతం వైరల్ గా మారుతుందని అక్కడి సిబ్బంది తెలిపారు. పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా సిబ్బంది ఇలా ప్రవర్తించినట్టు వారు పేర్కొన్నారు. ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు అయితే వారిచ్చిన వివరణ బాలల సంరక్షణ విభాగానికి చెందిన అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ విషయం పైన సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. హోమ్స్ లో పిల్లలపైన ఈ విధమైన చిత్రహింసలకు గురి చేయడానికి ప్రయత్నించే వారిని సహించకూడదని, బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.