हिन्दी | Epaper

Chevireddy Bhaskar Reddy: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి 14 రోజుల రిమాండ్

Sharanya
Chevireddy Bhaskar Reddy: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి 14 రోజుల రిమాండ్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం (Liquor scam) కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) పై అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. ఆయనను ఇటీవల బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.

విజయవాడకు తరలింపు, విచారణ

చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుకు ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్ నాయుడులను బెంగళూరు నుంచి విజయవాడకు తీసుకువచ్చిన సిట్ అధికారులు తమ కార్యాలయంలో నిన్న మూడు గంటలకు పైగా విచారించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఈ కేసుకు సంబంధించి పలు ముఖ్యాంశాలను పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో పలు నియోజకవర్గాలకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ నాయుడుకు జులై 1 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.

విజయవాడ జిల్లా జైలుకు తరలింపు

రిమాండ్ ఉత్తర్వులు వచ్చిన వెంటనే సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కరెడ్డి, వెంకటేశ్ నాయుడు ఇద్దరినీ విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇకపోతే ఈ కేసులో మరిన్ని కీలక నేతలు, మద్య కాంట్రాక్టర్ల ప్రమేయం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

Read also: PSR Anjaneyulu: పీఎస్ఆర్‌ ఆంజనేయులుకు హైకోర్టులో లభించిన ఊరట

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870