हिन्दी | Epaper
కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Water: శరీరంలో నీటి శాతం తక్కువైతే ఏమైతుంది

Ramya
Water: శరీరంలో నీటి శాతం తక్కువైతే ఏమైతుంది

రోజుకు ఎంత నీరు తాగాలి? ఎప్పుడు తాగాలి? పూర్తి గైడ్

మన శరీరానికి నీటి ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరంలో 60 శాతం వరకు నీరు ఉండటంతో, ప్రతి అవయవం సరిగా పనిచేయాలంటే నీరు తప్పనిసరి. మనం ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బతికెయ్యగలుగుతాం. కానీ నీరు లేకుండా ఎక్కువసేపు జీవించటం సాధ్యంకాదు. అయితే రోజుకు ఎంత నీరు తాగాలి? ఎప్పుడు తాగాలి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కేవలం దాహం వేసినప్పుడే కాదు, అవసరమైన సమయాల్లో నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Cropped shot of a young woman enjoying a bottle of water while out for a run

ఆకలిగా అనిపించినప్పుడు నీరు తాగండి

దాహం మరియు ఆకలి సిగ్నల్స్‌ను మెదడు ఒకే విధంగా ప్రాసెస్ చేస్తుందనీ, కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడూ నిజానికి శరీరానికి నీరు అవసరమై ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆకలిగా అనిపించినప్పుడు ఒక గ్లాసు నీరు తాగడం మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల ఆకలి కూడా కొంతవరకు నియంత్రించబడుతుంది.

నిద్రలేచిన వెంటనే నీరు తాగడం ఎందుకు అవసరం?

ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. రాత్రి పొడిగా ఉన్న శరీరానికి తగినంత హైడ్రేషన్ అందించటం వల్ల మేధస్సు చురుకుగా మారుతుంది. కొంత నిమ్మరసం కలిపితే శరీరానికి అవసరమైన విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి.

చెమట వచ్చినప్పుడు తగినంత నీరు తాగండి

ఎండాకాలం, వ్యాయామం చేసిన తర్వాత చెమట రూపంలో శరీరంలోని నీరు కోల్పోతాం. ఇది శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు సహాయపడుతుంది. కానీ దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. కాబట్టి శరీరానికి తిరిగి తగినంత నీరు అందించటం తప్పనిసరి. మేయోగ్లినిక్ సూచనల ప్రకారం వ్యాయామం ముందు, తర్వాత, వ్యాయామ సమయంలో కూడా నీరు తాగాలి.

జబ్బుల సమయంలో నీటి ప్రాముఖ్యత

జ్వరం, వాంతులు, విరేచనాల వంటి ఆరోగ్య సమస్యల సమయంలో శరీరానికి ఎక్కువ నీరు కోల్పోతుంది. అలాంటప్పుడు ఎప్పటికప్పుడు తక్కువ మోతాదుల్లో అయినా నీరు తాగడం తప్పనిసరి. దాహం లేకున్నా నీరు తాగాలి. మద్యం, కాఫీ వంటి పదార్థాలను తక్కువగా తీసుకోవడం ద్వారా నీటి నష్టం నివారించవచ్చు.

నెలసరి సమయంలో నీటి అవసరం

మహిళలు నెలసరి సమయంలో ఎక్కువ నీరు తాగితే రుతుక్రమ నొప్పులు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల తలనొప్పి, కడుపునొప్పులు తీవ్రతరంగా మారవచ్చు. కాబట్టి నెలసరి సమయంలో మరింత జాగ్రత్తగా నీరు తాగాలి.

మధ్యాహ్నం ఒత్తిడిలో నీరు తాగడం ఎంత మంచిది?

మధ్యాహ్నం ఒత్తిడిగా అనిపించినప్పుడు చాలామంది టీ, కాఫీ వైపు మొగ్గుతారు. కానీ దీని బదులు ఓ గ్లాసు నీరు తాగడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొద్దిగా నిమ్మరసం కలిపితే శరీరాన్ని రిఫ్రెష్ చేసే పనిని చేస్తుంది. ఇది ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది.

తలనొప్పి వచ్చినప్పుడు హైడ్రేషన్ మర్చిపోకండి

తలనొప్పి రావడానికి శరీరంలో నీటి శాతం తగ్గడమే ఒక ముఖ్య కారణం. తరచూ తలనొప్పితో బాధపడే వారు రోజంతా నీటిని చిన్ని చిన్ని మోతాదుల్లో తాగడం మంచిది. పని మధ్యలో, ప్రయాణంలో వెంట నీటి బాటిల్ తీసుకెళ్లడం ఉత్తమం.

భోజనానికి ముందు నీరు తాగడం వల్ల ప్రయోజనాలు

భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల ఆకలి నియంత్రించబడుతుంది. ఇది బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. పరిశోధనల ప్రకారం ఇది ఒక సరికొత్త ఆరోగ్య అలవాటు.

ఏకాగ్రత కుదరనప్పుడు నీరు తాగండి

పని చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు ఏకాగ్రత లోపించడం సాధారణం. అప్పుడు ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్ల మెదడులో రక్తప్రసరణ మందగిస్తుంది. ఓ గ్లాసు నీరు తాగడం వల్ల మళ్లీ చురుకుదనం తిరిగి వస్తుంది.

READ ALSO: Beauty: నలభై ఏళ్ల వయసులో ఆకట్టుకునే అందం మీ సొంతం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870