ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ చాలా మంది ఉదయాన్నే చేసే కొన్ని పనులు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడడం గమనించరు. నిద్ర లేవగానే కొన్ని అలవాట్లు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల ఉదయం నిద్రలేవగానే చేయకూడని పనులను తప్పక పాటించాలి.
నిద్ర లేటుగా లేవడం
చాలామంది ఉదయం చాలా పొద్దుపోయే దాకా పడుకుని ఉంటారు. ఇది అలసట, మెదడు నిస్సత్తువ, వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల సూర్యరశ్మి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డీ లభిస్తుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. నిద్రలేవకుంటే అలసట, మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.
బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయడం
కొంతమంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా పనుల్లో నిమగ్నమవుతారు. ముఖ్యంగా ఆఫీస్, కాలేజ్ కి వెళ్లేవారు బ్రేక్‌ఫాస్ట్ లేకుండా మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అలాగే ఉంటారు.ఆకలితో ఉండటం ఆరోగ్యానికి హానికరం.అలసట, బీపీ తక్కువ కావడం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.మెటాబాలిజం మందగించి శరీరం బరువు పెరిగే అవకాశం ఉంటుంది.బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. ఆహారంలో పోషకాలు సమతుల్యం ఉండేలా చూసుకోవాలి.

నిద్ర లేవగానే స్మార్ట్‌ఫోన్ చూడటం
మొదటగా మన చేతిలోకి వచ్చే వస్తువు స్మార్ట్‌ఫోన్. చాలా మంది నిద్రలేవగానే ఫోన్ స్క్రీన్ చూస్తూ కాలయాపన చేస్తుంటారు. ఇది కళ్లపై ప్రభావం చూపి, తలనొప్పి, ఒత్తిడి, కేంద్రికరణ శక్తి తగ్గడం వంటి సమస్యలకు కారణమవుతుంది.ఉదయాన్నే స్మార్ట్‌ఫోన్ చూడటం మెదడులో ఒత్తిడిని పెంచి, కంటి చూపును మందగిస్తుంది. రాత్రి నిద్ర పూర్ణంగా లేనివారు ఫోన్ ఉపయోగం వల్ల మరింత అలసటకు గురవుతారు.ఉదయాన్నే ఫోన్ చూడకుండానే కొంతసేపు ప్రకృతిలో గడపడం మంచిది.
ఉదయం వ్యాయామం చేయకపోవడం
శారీరక వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ చాలా మంది ఉదయం వ్యాయామం చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా శరీరం బరువు పెరిగే ప్రమాదం ఉంది.హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.మెదడు చురుకుగా పనిచేయకపోవడం, శరీరానికి శక్తి తగ్గిపోవడం జరుగుతుంది.ప్రతి రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది.
నీళ్లు తాగకపోవడం
ఉదయం లేవగానే గోరు వెచ్చని నీళ్లు తాగకపోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.శరీరంలోని విషతత్వాలు బయటకు పోవడం ఆలస్యం అవుతుంది.పొట్ట సంబంధిత సమస్యలు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశముంది.ఉదయాన్నే తేలికపాటి గోరు వెచ్చని నీళ్లు లేదా నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం అలవాట్లను సరిచేసుకోవాలి. ఉదయం లేటుగా లేవడం, మొబైల్ స్క్రీన్ చూడటం, బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయడం, వ్యాయామం నిర్లక్ష్యం చేయడం వంటి పనులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందువల్ల సంపూర్ణ ఆరోగ్యానికి సరైన అలవాట్లు పాటించడం అవసరం.
ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఆరోగ్య సమస్యల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.