ముల్లంగి (Radish)లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. కడుపు సమస్యలు (stomach problems), గ్యాస్, అజీర్ణం తగ్గించడంలో ఉపయోగపడుతుంది.ముల్లంగి డిటాక్స్ ఫుడ్‌గా పనిచేస్తుంది. విషపదార్థాలను బయటకు తీసి లివర్, కిడ్నీలను శుభ్రంగా ఉంచుతుంది.ముల్లంగి(Radish) గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ముల్లంగిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీ నియంత్రణకు సహాయపడుతుంది.ముల్లంగి(Radish)లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడంతో చర్మం గ్లో అవుతుంది, మచ్చలు తగ్గుతాయి.

కావలసిన పదార్దాలు
ముల్లంగి పచ్చడి తయారు చేయడానికి కావలసిన ఒకటి, నూనె: పావు కప్పు, ధనియాలు: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర: ఒక టీస్పూన్, పోపుగింజలు (ఆవాలు, జీలకర్ర, మినుప పప్పు, శనగ పప్పు): రెండు టీస్పూన్లు, ఎండు మిరపకాయలు: పది, వెల్లుల్లి రెబ్బలు: ఐదు, కరివేపాకు: ఒక రెబ్బ, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పసుపు: ఒక టీస్పూన్, చింతపండు గుజ్జు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత.
పచ్చడి తయారు విధానం
ముందుగా ముల్లంగి తొక్కతీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనెవేసి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి రెండు నిమిషాలు సన్నని మంటపై వేయించి తీయాలి. అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నూనెవేసి ముల్లంగి ముక్కలు వేసి సన్నని మంటపై వాసనపోయేలా వేగాక.. అర టీస్పూన్ పసుపు వేసి కలిపి దించేయాలి. ముందుగా వేయించుకున్న మిరపకాయల మిశ్రమం, తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు మెత్తగా గ్రైండ్ చేశాక.. ముల్లంగి ముక్కలు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. దీనికి పోపు పెడితే.. ముల్లంగి పచ్చడి సిద్ధం.
Read Also: hindi.vaartha.com
Read Also:Egg Benefits: గుడ్డులో ఏది మంచి ప్రోటీన్? పరిశోధనలు