పెసరుపప్పు పకోడి (Lentil pakoda)ఒక హెల్తీ, క్రిస్పీ, మరియు ఎంతో రుచికరమైన స్నాక్. ఇది ప్రొటీన్‌తో సమృద్ధిగా ఉండే పెసరుపప్పుతో తయారవుతుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది(Good for health). వర్షాకాలంలో, సాయంత్రం వేళ గరం గరం చాయ్‌తో సరదాగా తినేందుకు బాగుంటుంది.

కావలసిన పదార్థాలు
పెసరుపప్పు : ఒక కప్పు, అల్లం : ఒక అంగుళం ముక్క, పచ్చిమిర్చి రెండు, ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు కొద్దిగా, పసుపు పావు టీస్పూన్, గరం మసాలా అర టీస్పూన్, కారం అర టీస్పూన్, జీలకర్ర ఒక టీస్పూన్, వాము పావు టీస్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె వేయించడానికి సరిపడినంత.
తయారు చేసే విధానం
పెసరుపప్పును శుభ్రంగా కడిగి ఒక గంటసేపు నానబెట్టాలి. నీళ్లను వంపేసి.. పప్పును మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. అందులో అల్లం ముక్క వేసి.. కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఓ గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుతోపాటు కొత్తిమీర తరుగు, జీలకర్ర, వాము, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి. అందులోనే మిక్సీ పట్టుకున్న పెసరుపప్పును కూడా వేసుకొని మరోసారి బాగా కలపాలి. స్టవ్‌పైన కడాయి పెట్టి.. డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత.. మంటను సిమ్‌లో పెట్టుకొని, పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పకోడీలుLentil pakodaగా వేసుకోవాలి. కడాయి నిండుగా పకోడీలు వేసుకున్న తర్వాత.. మంటను మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకోవాలి. పకోడీలను Lentil pakoda గంటెతో కలుపుతూ.. రెండు వైపులా ఎర్రగా, కరకరలాడేలా వేయించుకుని వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు వీటిని వేడివేడిగా.. గ్రీన్ చట్నీ లేదా టమాటా సాస్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి.
పకోడి ఆవిరితో స్టీమ్ చేసి లేదా ఎయిర్‌ఫ్రయ్యర్‌లో వేసుకుంటే ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది.
Read Also: hindi.vaartha.com
Read Also: white salt : అయోడిన్ కలిపినా తెల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిదా?