చాలామందికి కాకరకాయ పేరే ఇష్టం ఉండదు. కడుపునిండా తింటారు కానీ ముక్కు పట్టుకొని తింటారు. కారణం – దాని చేదు రుచి. అయితే ఆయుర్వేదం, నాటి పెద్దల అనుభవం చెప్పే సంగతేమిటంటే – “చేదు ఔషధం” అన్నది కాకరకాయకి అక్షరార్థం. కాకరకాయను రోగనిరోధక శక్తిని పెంచే, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచే, రక్తాన్ని శుభ్రపరిచే శక్తివంతమైన ఆహారంగా పరిగణించవచ్చు. ఇప్పుడు దీని విశిష్టతలను విపులంగా తెలుసుకుందాం.

కాకరకాయతో ప్రయోజనాలు
పోషకాలు అధికం
కాకరకాయలో ఫైబర్, విటమిన్-C, విటమిన్-A, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తగిన పోషకాలను అందించడమే కాకుండా, అనేక వ్యాధులను దూరం చేస్తాయి.
జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయకం
ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన కాకరకాయ మలబద్ధకం, వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజింపజెయ్యడం ద్వారా ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తికి బలాన్ని
విటమిన్-C మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. ఫలితంగా శరీరం వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడగలదు. ఇన్ఫెక్షన్లు తక్కువగా జరుగుతాయి.
చర్మ ఆరోగ్యానికి వరం
కాకరకాయ జ్యూస్‌ను తాగే వారు చర్మం ఆరోగ్యంగా ఉండటాన్ని అనుభవించవచ్చు. మొటిమలు, మచ్చలు, వంటి చర్మ వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి.
జుట్టుకు శక్తి
కాకరకాయ జ్యూస్ జుట్టు వృద్ధికి సహాయపడుతుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి, డాండ్రఫ్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చుండ్రు నివారణతో పాటు జుట్టు పడిపోవడం కూడా తగ్గుతుంది.
డయాబెటిస్ నియంత్రణలో సహాయపడే శక్తివంతమైన ఆహారం
కాకరకాయలో ఉండే చరంటిన్ (charantin) అనే పదార్థం రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. ఇది ఇన్సులిన్ సేన్సిటివిటిను పెంచుతుంది. అందుకే, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిదిగా భావించబడుతుంది.

గుండె ఆరోగ్యానికి
కాకరకాయ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి హార్ట్ బ్లాకేజెస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తనాళాల్లో తడి తగ్గించి, సురక్షితమైన రక్త ప్రసరణకు తోడ్పడుతుంది. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాకరకాయ రసం కాలేయాన్ని డిటాక్స్ చేస్తుంది. ఇది లివర్ ఫంక్షనింగ్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ లేదా ఆల్కహాలిక్ లివర్ దెబ్బతినకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
రువు తగ్గాలనుకునేవారికి ఉత్తమ ఎంపిక
కాకరకాయ జ్యూస్ లేదా బాగా ఉడికించిన కాకరకాయ వంటకాలు మెటబాలిజాన్ని పెంచుతాయి. ఫ్యాట్ బర్నింగ్ సామర్థ్యం ఉన్న కాకరకాయ బరువు తగ్గే వారిని ప్రోత్సహిస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువ, పోషకాలైతే ఎక్కువ. ఇది మూత్ర విసర్జనని ప్రేరేపిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Read also: Kidney stones: కిడ్నీలలో రాళ్లకు కనిపించే లక్షణాలు..నివారణలు