हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Cucumber Seeds Benifits: కీర‌దోస‌కాయ‌ విత్త‌నాల‌తో ఎన్ని లాభాలో తెలుసా..

Sudha
Cucumber Seeds Benifits: కీర‌దోస‌కాయ‌ విత్త‌నాల‌తో ఎన్ని లాభాలో తెలుసా..

కీరదోసకాయ మనకు సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో కూడా సులభంగా లభించే శాకహార పదార్థం. ఇది తక్కువ ఖర్చుతో, అధిక ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits)కలిగించే అద్భుతమైన కూరగాయలలో ఒకటి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా ఉపయోగపడుతుంది కానీ, ఏడాది పొడవునా తినడం ద్వారా శరీరానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి. చాలా మంది వీటిని కేవ‌లం వేస‌వి కాలంలోనే తింటారు. కీర‌దోస‌కాయ‌ల‌ను తింటే శ‌రీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. నీరు లభిస్తుంది.శ‌రీరంలోని వేడి తగ్గిపోతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ముఖ్యంగా ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. అయితే కీర‌దోస‌కాయ‌లు మాత్ర‌మే కాదు, వాటిల్లో ఉండే విత్త‌నాలు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది ఈ విత్త‌నాల‌ను తీసి తింటారు. కానీ వీటిని ప‌డేయ‌కూడ‌దు. కీర‌దోస విత్త‌నాలు (Cucumber Seeds Benifits)అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ విత్త‌నాల్లో (Cucumber Seeds Benifits) ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. అలాగే విట‌మిన్లు కె, సి, బి1, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, మాంగ‌నీస్‌, క్యాల్షియం, ఫ్లేవ‌నాయిడ్స్, బీటా కెరోటిన్‌, ఇత‌ర ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు ఈ విత్త‌నాల్లో (Cucumber Seeds Benifits)అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల కీర‌దోస విత్త‌నాల‌ను తింటే పోష‌కాలు అనేకం ల‌భిస్తాయి. పోష‌కాహార లోపం త‌గ్గుతుంది.

 Cucumber Seeds: కీర‌దోస‌కాయ‌ విత్త‌నాల‌తో ఎన్ని లాభాలో  తెలుసా..
Cucumber Seeds: కీర‌దోస‌కాయ‌ విత్త‌నాల‌తో ఎన్ని లాభాలో తెలుసా..

క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గిపోతుంది

ఈ విత్త‌నాల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగుల్లో మ‌లం క‌ద‌లిక‌లు స‌రిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. ఈ విత్త‌నాలు ప్రీ బ‌యోటిక్ ఆహారంగా కూడా ప‌నిచేస్తాయి. దీనివ‌ల్ల జీర్ణాశ‌యంలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. కీర‌దోస విత్త‌నాల‌ను తింటే క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గిపోతుంది. గ్యాస్ బయ‌ట‌కు వెళ్లిపోతుంది. పొట్ట‌లో ఏర్ప‌డిన అసౌక‌ర్యం సైతం త‌గ్గుతుంది. ఈ విత్త‌నాల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల వీటిని తింటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారికి ఈ విత్త‌నాలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు.

శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను నియంత్ర‌ణ‌

కీర‌దోస విత్త‌నాల్లో సైతం అధికంగా నీరు ఉంటుంది. అందువ‌ల్ల ఈ విత్త‌నాల‌ను తింటే శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. శ‌రీరంలోని వేడిపోయి చ‌ల్ల‌గా మారుతుంది. వేడి శ‌రీరం ఉన్న‌వారికి ఈ విత్త‌నాలు ఎంతో మేలు చేస్తాయి. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. ఈ విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్‌, ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలించేందుకు స‌హాయం చేస్తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఏర్ప‌డే వాపులు త‌గ్గిపోతాయి. దీని వ‌ల్ల క్యాన్స‌ర్‌, గుండె పోటు వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అలాగే వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా క‌నిపిస్తుంది. య‌వ్వ‌నంగా ఉంటారు.

 Cucumber Seeds: కీర‌దోస‌కాయ‌ విత్త‌నాల‌తో ఎన్ని లాభాలో  తెలుసా..
Cucumber Seeds: కీర‌దోస‌కాయ‌ విత్త‌నాల‌తో ఎన్ని లాభాలో తెలుసా..

విట‌మిన్ ఇ

కీర‌దోస విత్త‌నాల్లో ఫైబ‌ర్ అధికంగా ఉన్న కార‌ణం వ‌ల్ల ఈ విత్తనాల‌ను తింటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. అధికంగా బ‌రువు ఉన్న‌వారు ఈ విత్త‌నాల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. కీర‌దోస విత్త‌నాల్లో విట‌మిన్ ఇ కూడా స‌మృద్ధిగానే ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చ‌ర్మ క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. చ‌ర్మానికి కావ‌ల్సిన తేమ ల‌భించి మృదువుగా మారుతుంది. పొడి చ‌ర్మం ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. చ‌ర్మం సాగే గుణాన్ని పొందుతుంది. దీంతో చ‌ర్మం కాంతివంతంగా క‌నిపిస్తుంది. ఇలా కీర‌దోస విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

విత్తనాలు ఎందుకు శక్తివంతమైనవి?

విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మన ఆరోగ్యానికి మంచిది. ఫలితంగా వాటికి అధిక పోషక విలువలు ఉంటాయి. అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో పాటు, వాటిలో మంచి మొత్తంలో పాలీఅన్‌శాచురేటెడ్ మరియు మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి.

రోజూ విత్తనాలు తింటే ఏమవుతుంది?

మీ ఆహారంలో భాగంగా గింజలు మరియు విత్తనాలను చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది . కొవ్వులు అధికంగా ఉన్నప్పటికీ, గింజలు మరియు విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులకు (మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు వంటివి) మంచి వనరులు మరియు (అనారోగ్యకరమైన) సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి.

హార్మోన్ల సమతుల్యతకు ఏ విత్తనాలు మంచిది?

ఋతు చక్రం యొక్క మొదటి దశలో (ఫోలిక్యులర్ దశ), గుమ్మడికాయ గింజలు మరియు అవిసె గింజలు మన ఈస్ట్రోజెన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు అదనపు ఈస్ట్రోజెన్‌ను నివారిస్తాయి. అవిసె గింజలు లిగ్నాన్‌లను కలిగి ఉంటాయి, ఇవి అదనపు ఈస్ట్రోజెన్‌తో బంధిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: uttermilk: మజ్జిగలో అల్లం కలిపి తాగితే కలిగే అద్భుత ఆరోగ్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

📢 For Advertisement Booking: 98481 12870