हिन्दी | Epaper
మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Donald Trump : మొదలైన భారతీయ గ్రీన్ కార్డుదారులపై తనిఖీలు

Vanipushpa
Donald Trump : మొదలైన భారతీయ గ్రీన్ కార్డుదారులపై తనిఖీలు

అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారతీయులకు మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలు దఫాలుగా అమెరికా నుంచి అక్రమ వలసల్ని భారత్ కు పంపేసిన ట్రంప్.. ఇప్పుడు గ్రీన్ కార్డు దారులకు షాకిచ్చారు. అమెరికాలో ఉంటున్న భారతీయ గ్రీన్ కార్డు దారులపై ఇవాళ్టి నుంచి తనిఖీలు మొదలయ్యాయి. దీంతో వీరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
గ్రీన్ కార్డుదారులపై తనిఖీలు అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాస గ్యారంటీ ఇవ్వలేమంటూ తాజాగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనతో మొదలైన ఆందోళనలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. ముఖ్యంగా గ్రీన్ కార్డు కలిగి ఉన్న భారతీయుల్ని విమానాశ్రయాలలో బట్టలు విప్పి తనిఖీలు, నిర్బంధాలు, విచారణలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరికి గ్రీన్ కార్డులు ఉన్నప్పటికీ వాటి చట్టబద్ధత సహా పలు అంశాల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

మొదలైన భారతీయ గ్రీన్ కార్డుదారులపై తనిఖీలు

భారతీయులే టార్గెట్
భారతీయులే టార్గెట్ అమెరికావ్యాప్తంగా విమానాశ్రయాలలో సీనియర్ సిటిజన్లు అయిన భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లను తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా వెలుపల ఎక్కువ కాలం గడిపే వ్యక్తులను, భారతదేశాన్ని తరచుగా సందర్శించే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ సిటిజన్ గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఫారమ్ I-407పై సంతకం చేయమని బలవంతం చేస్తున్నారని ఫ్లోరిడాకు చెందిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాది అశ్విన్ శర్మ ఆరోపించారు.
ఫామ్ I-407పై సంతకాలకు ఒత్తిడి
ఫామ్ I-407పై సంతకాలకు ఒత్తిడి అమెరికాలో గ్రీన్ కార్డులు కలిగిన భారతీయ సీనియర్ సిటిజన్లను ఇప్పుడు పలు చోట్ల ఫామ్ I-407పై సంతకాలు చేయాలంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సియాటిల్‌కు చెందిన న్యాయవాది కృపా ఉపాధ్యాయ్ ఒత్తిడిలో పడి గ్రీన్ కార్డ్‌లను అప్పగించవద్దని హెచ్చరించారు. ఒక వ్యక్తి ‘స్వచ్ఛందంగా ఫారమ్ I-407పై సంతకం చేయకపోతే సరిహద్దులో వారి గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయలేరని గుర్తుచేశారు. వారు విమానాశ్రయంలో లొంగిపోతే మాత్రం వారు ఆ హక్కును కోల్పోతారన్నారు.
ప్రమాదంలో వీరి గ్రీన్ కార్డులు..!
అమెరికా ఫస్ట్ నినాదంతో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. ఇందులో భాగంగా గ్రీన్ కార్డుదారుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ సురక్షితంగా భావించిన గ్రీన్ కార్డ్ హోల్డర్లు ప్రమాదంలో పడ్డారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం గ్రీన్ కార్డ్ హోల్డర్లు అనేక కారణాల వల్ల తమ హోదాను కోల్పోవచ్చు. ఇందులో అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం ఒకటి. ఆరు నెలలకు పైగా ఇలా బయట ఉంటే వారిని తనిఖీ చేసే అధికారం ఉంది. సంవత్సరం పాటు ఆటోమేటిగ్గా వీరు గ్రీన్ కార్డు హోదా కోల్పోవచ్చు.

స్వదేశానికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు

అలాగే జాతీయ భద్రతా సమస్యలు, సంభావ్య ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. మోసం, వీసా ఉల్లంఘనలు చేసిన వారూ ప్రమాదంలో పడుతున్నారు. భారతీయుల్లో భయాలు అమెరికాలో అతిపెద్ద గ్రీన్ కార్డ్ హోల్డర్లలో భారతీయులు ఉన్నారు. ఇప్పటికే ఉపాధి ఆధారిత బ్యాక్‌లాగ్‌లో మిలియన్ కంటే ఎక్కువ మంది వీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ అమెరికాలో గ్రీన్ కార్డు ఉంటే చాలు సురక్షితంగా ఉండొచ్చని భావించిన వీరంతా ఇప్పుడు స్వదేశానికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసే గర్భిణీలకు ఇవ్వం

టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసే గర్భిణీలకు ఇవ్వం

మెస్సీ ఇండియా టూర్ హైలైట్స్ ఇవే..

మెస్సీ ఇండియా టూర్ హైలైట్స్ ఇవే..

ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు

ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు

మెక్సికో టారిఫ్‌లు భారత దిగుమతులపై పెద్ద ప్రభావం?…

మెక్సికో టారిఫ్‌లు భారత దిగుమతులపై పెద్ద ప్రభావం?…

మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్

మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్

ఆరు నెలల పనికి ₹1.3 కోట్లు: వెళ్ళాలా లేదా?

ఆరు నెలల పనికి ₹1.3 కోట్లు: వెళ్ళాలా లేదా?

అమెరికా అంగీకరిస్తే? భారత్ US వ్యాపార ఒప్పందం రెడీ…

అమెరికా అంగీకరిస్తే? భారత్ US వ్యాపార ఒప్పందం రెడీ…

‘డార్క్ ఫ్లీట్’పై అమెరికా దూకుడు – వెనిజులా ట్యాంకర్ స్వాధీనం

‘డార్క్ ఫ్లీట్’పై అమెరికా దూకుడు – వెనిజులా ట్యాంకర్ స్వాధీనం

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

ఖాళీ టైంలో ‘డీప్ రీసెర్చ్ AI యాప్‌’ ఆవిష్కరణ చేసిన సత్య నాదెళ్ల

ఖాళీ టైంలో ‘డీప్ రీసెర్చ్ AI యాప్‌’ ఆవిష్కరణ చేసిన సత్య నాదెళ్ల

మెక్సికో టారిఫ్స్ తో ఇండియాకు భారీ నష్టం!

మెక్సికో టారిఫ్స్ తో ఇండియాకు భారీ నష్టం!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే అది “మూడవ ప్రపంచ యుద్ధమే “: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే అది “మూడవ ప్రపంచ యుద్ధమే “: ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870