సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌

Ola, rapido, uber: సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌

ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్‌, ర్యాపిడోల వినియోగం బాగా పెరిగిపోయింది. విపరీతంగా పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా.. ఆయా కంపెనీలు వినియోగదారుల నుంచి భారీగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నాయి. అలా అని క్యాబ్‌ డ్రైవర్లు అంతే మొత్తం చెల్లించడం లేదు. కస్టమర్‌ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి.. మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి. వీటిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్‌ ఐడియాతో ముందుకు వచ్చింది. సహకార్‌ ట్యాక్సీ పేరుతో ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో వెల్లడించారు.

Advertisements
సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌

సహకార్‌ ట్యాక్సీ విధానం
డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిన సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ సేవ ‘సహకార్‌ ట్యాక్సీని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో సహకార సంఘాలు ద్విచక్ర వాహనాలు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. “ఇది కేవలం నినాదం కాదు. దీనిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ మూడున్నర సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేసింది. కొన్ని నెలల్లో, డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలు అందించే విధంగా ఒక ప్రధాన సహకార ట్యాక్సీ సేవ ప్రారంభిస్తామని అని హోం మంత్రి అన్నారు.
రెండు కంపెనీలకు నోటీసులు
వినియోగదారుడు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌ల బుక్ చేసుకుంటున్నారా అనే దాని ఆధారంగా కూడా రైడ్ ఛార్జీలు మారుతున్నాయని నివేదికలు వెలువడిన తర్వాత సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఇటీవల రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా, ఓలా ప్లాట్‌ఫామ్ ఆధారిత ధర వివక్షత వాదనలను తోసిపుచ్చింది. “మా కస్టమర్లందరికీ మేము ఒక విధమైన ధరలు కలిగి ఉన్నాం, సెల్‌ఫోన్ ఆధారంగా ధర నిర్ణయించడం లేదని వెల్లడించింది. ఉబెర్ కూడా ఈ ఆరోపణలను ఖండించింది.

Related Posts
Fire Accident : పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం
Fire breaks out at Park Hyatt Hotel

Fire Accident : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావటంతో హోటల్ సిబ్బంది, Read more

MSC Turkiye : అదానీ విజింజం ఓడరేవుకు అతిపెద్ద కార్గో షిప్‌..విశేషాలు ఇవే
eco friendly container ship

ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్‌లలో ఒకటైన ఎంఎస్‌సీ తుర్కియే (MSC TÜRKIYE) బుధవారం అదానీ గ్రూప్ అభివృద్ధి చేస్తున్న కేరళ రాష్ట్రంలోని విజింజం ఓడరేవుకు చేరుకోవడం విశేషం. Read more

వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
vizag metro

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో నిర్మాణం ద్వారా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంతో పాటు, ప్రజలకు Read more

ఏపీకి అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు : రామ్మోహన్ నాయుడు
7 more airports in addition to AP.. Rammohan Naidu

న్యూఢిల్లీ: ఏపీలో అదనంగా మరో ఏడు విమానాశ్రయాలు రాబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×