చాలా మంది సేవింగ్స్ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల ను ఆశ్రయిస్తుంటారు. బ్యాంకు FDలలో పెట్టుబడి పెట్టడం అనేది ఈ రోజుల్లో చాల పబ్లిసిటీ పొందింది. ఇప్పుడు దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FD వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. అలాగే ఈ మార్పులు 15 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తాయని ప్రకటించింది.
కొత్త రేట్లతో తిరిగి ప్రారంభం
అయితే బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, 1 నుండి 3 సంవత్సరాల కాలానికి వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది, ఇవి సాధారణ కస్టమర్లకి ఇంకా సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ మార్పుతో పాటు SBI ప్రత్యేక “అమృత్ వ్రిష్టి” ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని 444 రోజుల కాలపరిమితితో కొత్త రేట్లతో తిరిగి ప్రారంభించింది.

సీనియర్ సిటిజన్లకు FD వడ్డీ రేట్లు
ఈ వడ్డీ రేట్ల మార్పు తర్వాత SBI 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు కాలపరిమితి డిపాజిట్లకు 3.50% నుండి 6.9% (ప్రత్యేక డిపాజిట్లు లేకుండా) వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 4% నుండి 7.50% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.30% నుండి 7.20%కి తగ్గించింది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న FDలపై వడ్డీ రేటు 7.50% నుండి 7.40%కి తగ్గించింది. SBI అమృత్ వ్రిష్టి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ, 444 రోజుల కాలపరిమితి ఉన్న ప్రత్యేక పథకం “అమృత్ వృశ్చి”ని తిరిగి ప్రారంభించింది. ఈ పథకం 15 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తుంది. ఈ పథకం ఇప్పుడు సాధారణ ప్రజలకు సంవత్సరానికి 7.05% అధిక వడ్డీ రేటును అందిస్తుంది.
7 రోజుల నుండి 45 రోజుల వరకు
7 రోజుల నుండి 45 రోజుల వరకు FDలపై 3.50% వడ్డీ, 46 రోజుల నుండి 179 రోజుల వరకు FDలపై 5.50% వడ్డీ, 180 రోజుల నుండి 210 రోజుల వరకు FDలపై 6.25% వడ్డీ, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువకాల FDలపై 6.75% వడ్డీ సంపాదించవచ్చు. 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ కాల FD డిపాజిట్లకు అలాగే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు డిపాజిట్లకు SBI 6.50% వడ్డీని ఎప్పటిలాగే మార్చకుండా ఉంచింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితిపై 7.20% వడ్డీ రేటు లభిస్తుంది, అంటే 7.30% వడ్డీ రేటు నుండి 10 బేసిస్ పాయింట్లు తక్కువ. అలాగే 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ కాలనికి 7.40% వడ్డీ రేటు ఇస్తుంది, అంటే ప్రస్తుత 7.50% నుండి తగ్గింది.
Read Also: Nitin Gadkari : ఢిల్లీలోని వాయు కాలుష్యంపై నితిన్ గడ్కరీ ఆందోళన