ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇవాళ (మే 17) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ఉదయం నుంచి పలు కార్యకలాపాల్లో పాల్గొంటారు. సి. క్యాంపు రైతు బజారులో సీఎం రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. సామాన్య ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంగా ఇది విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
స్వచ్ఛాంధ్ర పార్క్కు శంకుస్థాపన
అనంతరం జైరాజ్ స్టీల్ సంస్థ నిర్మించబోయే స్వచ్ఛాంధ్ర పార్క్ (Swachhandra Park)శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, అక్కడి నుంచి పీ4 కార్యక్రమంలో పాల్గొంటారు. పీ4 కార్యక్రమం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే కార్యక్రమాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం ప్రజావేదిక వద్ద సభలో ప్రసంగించి, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
టీడీపీ నేతలతో సమావేశం
మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:35 వరకు టీడీపీ నేతలతో ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్న సీఎం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. సాయంత్రం 5:35కి కర్నూలు ఎయిర్‌పోర్ట్ చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.
Read Also : Operation Sindoor : విదేశాలకు ఎంపీల బృందాలు!