ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అప్పట్లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కుటుంబ నియంత్రణను ప్రోత్సహించామని, అయితే ప్రస్తుత కాలంలో దేశ జనాభా పెరగడం అవసరమని ఆయన ఈ కార్యక్రమంలో స్పష్టం చేసారు. జనాభా పెరగకపోతే రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు.‘‘ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ ప్రస్తుతం ఎదురవుతున్న ప్రధాన సమస్య . ఇది.వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండే దేశాల్లో ఉత్పాదకత తగ్గిపోతుంటుందని వివరించారు. జనాభా వృద్ధి చెందడం అత్యంత ముఖ్యమైన అంశం అని స్పష్టం చేశారు. దేశంలో రెండో తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం పై విమర్శ
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాట్లాడుతూ‘‘గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసింది. అది కూడా అభివృద్ధి పనులకు కాదు ఇష్టానుసారంగా ఖర్చులు చేశారు. నాయకుడు విధ్వంసం సృష్టిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది.ఒక మంచి నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది’’ అని చెప్పారు.అప్పట్లో నేను ఐటీ రంగాన్ని ప్రోత్సహించాను.ఫలితంగా ఇప్పుడు తెలుగువారు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారు. మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు.బాగా చదివిస్తే ప్రపంచాన్ని ఏలుతారు.ఇది నేను నమ్ముతున్న నిజం’’ అని అన్నారు.రాష్ట్రంలో సంపద సృష్టించే పనిలో ఉన్నామని, అందులో భాగంగా పీ4 పథకాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. ‘‘ఈ పథకం ద్వారా సంపదను సృష్టించి, దాన్ని అందరికీ పంచుతాం.ముఖ్యంగా 25 శాతం అట్టడుగు ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది’’ అని అన్నారు.

కార్యక్రమం
రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేశామని, సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారు, ఇప్పుడు పి4 అనే వినూత్న కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు.పీ4 అంటే – పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం. జనాభాలోని అత్యంత సంపన్నులైన 10 శాతం మంది పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 25శాతం మందికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది.విరాళాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా నియమిస్తారు.నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు. ప్రభుత్వం డిజిటల్ డాష్ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్ గా వ్యవహరిస్తుంది.
Read Also: CM Chandrababu : బాబు జగ్జీవన్ రామ్‌కి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు