Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

ఏలూరు/ పోలవరం ప్రభాతవార్త:

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలన చేసేందుకు విచ్చేయుచున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం ప్రాజెక్ట్ సైట్ లో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు పోలవరం విచ్చేస్తారని, ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులందరూ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులలో డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం, గ్యాప్ 1, గాప్ 2 , వైబ్రో కంప్రెషన్, తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారన్నారు.

WhatsApp Image 2025 03 24 at 15.21.38 a96f0f59

ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు

ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించే ప్రదేశాలలో పనుల ప్రగతి సూచించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసి, వివరాలు సీఎం కి తెలియజేయాలన్నారు. ఆయా ప్రదేశాలలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేయాలనీ పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే శాసనసభ్యులు, ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రివర్యులు పాల్గొనే ప్రదేశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, వడదెబ్బ నివారణకు సంబందించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
అంతకుముందు డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం, గ్యాప్ 1, గాప్ 2 , వైబ్రో కంప్రెషన్, తదితర పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ రమణ, పోలవరం ప్రాజెక్ట్ సూపెరింటెండెంటింగ్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు, డిఈ డి.శ్రీనివాస్, సిఐ బాల్ సురేష్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.

Related Posts
కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్ – సీఎం రేవంత్
kcr kishan revanth

తెలంగాణలో రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. "కేసీఆర్ కోసం కిషన్ రెడ్డి Read more

Roja : కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు
Roja కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు

Roja : కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేస్తూ Read more

జన్మతః పౌరసత్వం రద్దుపై అప్పీల్‌కు వెళ్తాం : ట్రంప్‌
donald trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ రద్దు చేసిన జన్మతఃపౌరసత్వ హక్కు ఆదేశాలను ఫెడరల్‌ కోర్టు నిలిపివేసింది. వలస వచ్చిన వారి సంతానానికి అటోమెటిక్​గా అమెరికా పౌరసత్వం Read more

విడుదల పార్ట్ 2 OTT తేదీ: ఎప్పుడు ఎక్కడ చూడొచ్చు?
విడుదల పార్ట్ 2 OTT తేదీ: ఎప్పుడు ఎక్కడ చూడొచ్చు?

విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ విడుదల పార్ట్ 2, డిసెంబర్ 20 న విడుదలైంది మరియు ఇప్పుడు దాని డిజిటల్ విడుదలకు సిద్ధంగా ఉంది. తీవ్ర కథాంశం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *