Chandrababu and his wife will visit Vontimitta on the 11th

Sitaramula Kalyanam : 11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు

Sitaramula Kalyanam : వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్టలో ఈ నెల 11న జరగనున్న కోదండరామస్వామి కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. తన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌ దంపతులతో కలిసి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం ఐదు గంటలకు ఒంటిమిట్ట చేరుకుంటారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అంతకుముందు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

Advertisements
11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు

ఒంటిమిట్టలో విస్తృత ఏర్పాట్లు

ముఖ్యమంత్రి రాక సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఒంటిమిట్టలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను ఈవో వివరించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న గ్యాలరీలలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్టు ఈవో తెలిపారు.

ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలు

ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపడతారు. కల్యాణ వేదిక ప్రవేశ మార్గంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 క్యూయేస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలు, శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం, కంక‌ణం, అన్నప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు : AP

Related Posts
వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు- టీడీపీ
వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు

అక్రమ తవ్వకాలు, రవాణా ద్వారా భారీ ఆదాయం.టెర్రిన్స్, మట్టి, గ్రావెల్, క్వారీల అక్రమ తవ్వకం, రవాణా ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూరిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వల్లభనేనివంశీ అక్రమార్జన Read more

ఉత్తర కొరియా రష్యాకు మద్దతు: కిమ్ జాంగ్ ఉన్ ప్రకటన
NO russia

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యాకు నిరంతర మద్దతు తెలపాలని నిర్ణయించారని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా ఏజెన్సీ శనివారంనాడు Read more

రేపు జగన్ ప్రెస్ మీట్
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో Read more

Lucknow: లక్నోలో ఘోరం..ఫిర్యాదుదారుడిపై మూత్రవిసర్జన
Lucknow: లక్నోలో ఘోరం..ఫిర్యాదుదారుడిపై మూత్రవిసర్జన

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన అమానుష ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, తనను దుర్వినియోగానికి గురిచేశారని ఓ న్యాయవాది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×