हिन्दी | Epaper

IND-US Trade: భారత్ పై ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన కేంద్రం

Vanipushpa
IND-US Trade: భారత్ పై ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన కేంద్రం

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(America President Trump) సుంకాల(Trade)తో విరుచుకుపడ్డానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ సిద్ధమైంది. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్యనా చాలా రోజుల నుంచి సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఒక కొలిక్కి వచ్చాయని త్వరలోనే డీల్(Deal) ను ప్రకటిస్తారని తెలుస్తోంది. చాలా వరకు భారత్ ఉత్పత్తులపై 10 శాతం సుంకాలను విధించడానికి అమెరికా ఒప్పుకున్నట్టు సమాచారం. కొన్నింటిపై మాత్రం అధిక టారీఫ్ లు తప్పవని చెబుతున్నారు. అలాగే అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 5 నుంచి 8 శాతం వరకు భారత్‌ సుంకాలు విధించడానికి డీల్ కుదిరిందని వార్తలు వస్తున్నాయి.

IND-US Trade: భారత్ పై ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన కేంద్రం
IND-US Trade: భారత్ పై ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన కేంద్రం

ఎట్టిపరిస్థితుల్లోనూ రెడీగా లేదని తెగేసి చెప్పిన భారత్

అయితే ఈ ఒప్పందంలో అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు మాత్రం భారత్ నో చెప్పింది. డీల్ లో భాగంగా అమెరికా పాడి ఉత్పత్తుల మీద చాలా ఒత్తిడి తెచ్చిందని..అయినా భారత్ గట్టిగా నిలబడిందని తెలుస్తోంది. భారత్‌లో ఈ రంగాలపై ఆధారపడిన కోట్లాది మంది ప్రయోజనాలు దెబ్బతింటాయని స్పష్టం చేసిందని చెబుతున్నారు. దానికి తోడు అమెరికా పాటు నాన్ వెజ్ పాలని దిగుమతి చేసుకోవడానికి భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ రెడీగా లేదని తెగేసి చెప్పేసినట్టు సమాచారం.

సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధం: భారత్
పాలన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. ఎక్కడైనా అవే ఆవులు, గేదెలు. అవి ఇచ్చే పాలు నాన్ వెజ్ ఎలా అవుతాయి అనుకుంటున్నారా. అయితే అమెరికాలో పాడి ఉత్పత్తులు, వాటి పోషణ కాస్త భిన్నగా ఉంటుంది. అక్కడ ఆవులకు గడ్డితో పాటూ కోళ్ళు, చేపలు ఇతర పశువులకు సంబంధించి వ్యర్థ భాగాలు, కొవ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తుంటారు. ఇవి తినడం వలన పాలు మరింత ఎక్కువగా వస్తాయని అంటారు. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం ేస్తోంది. అంతేకాదు ఒకరకంగా పవిత్ర పదార్థ కూడా. అలాంటిది అమెరికాలో జంతు పదార్థాలను తినే ఆవులు, గేదెల నుంచి వచ్చే ‘నాన్‌ వెజ్‌’ పాలు, పాల పదార్థాలు సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని భరత అధికారుల వాదన. అందుకే పాడి ఉత్పత్తులకు నో చెప్పింది. కేవలం ప్రాసెస్‌ చేసిన పాడి ఉత్పత్తుల దిగుమతులకే అంగీకరించింది. వాటిపైనా జంతు సంబంధిత ఆహారం వాడలేదనే ధ్రువీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది .

Read hindi news: hindi.vaartha.com

Read Also : Nimisha Priya : ఎల్లుండే నిమిషకు ఉరిశిక్ష.. వాళ్ల మనసు మారదా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

📢 For Advertisement Booking: 98481 12870