ఐపీఎస్‌ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ!

ఐపీఎస్‌ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ!

అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్‌ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్‌ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలి
తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవ్‌ చేస్తూ.. 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ముగ్గురు ఐపీఎస్‌లు ఎవరంటే.. అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్‌ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్‌ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంజనీ కుమార్‌, అభిలాష బిస్త్‌ డీజీ ర్యాంక్‌లో ఉండగా, అభిషేక్‌ మహంతి ఎస్పీ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

Advertisements
ఐపీఎస్‌ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ!


ఏపీకి అలాట్‌ చేసిన కేంద్రం
కాగా ఈ ముగ్గురికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చిన కేంద్ర హోం శాఖ వెంటనే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలపై ఐపీఎస్‌లు కొంత సమయం కావాలని కోరే అవకాశం ఉంది. మూడు నెలల క్రితం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను ఇలాగే బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఈ ముగ్గురు ఐపీఎస్‌లకు షాక్‌ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి వీళ్లు ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ ముగ్గురిని కూడా కేంద్రం ఏపీకి అలాట్‌ చేసింది. కానీ, ఆ నిర్ణయాన్ని వీరు ముగ్గురు సవాల్‌ చేస్తూ క్యాట్‌ని ఆశ్రయించారు.

Related Posts
ఈ పోలీస్ ఉద్యోగం చేయలేం!
police

ఇటీవల పోలీస్ ఉద్యోగం చేయాలనే ఆశ చాలామందిలో కలుగుతున్నది. ఇందుకు కారణం మంచి జీతం, ఇతర అలవెన్సులు వుంటాయని భావన కావచ్చు. అయితే మనం అనుకున్నత సులభం Read more

Jammu Kashmir : జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఘ‌ర్ష‌ణ
MLAs clash in Jammu and Kashmir Assembly

Jammu Kashmir : జమ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో మూడు రోజుల‌గా వ‌క్ఫ్ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని వాయిదాల ప‌ర్వం న‌డుస్తోంది. అయితే ఇవాళ కొంద‌రు ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ ప్రాంగ‌ణంలో Read more

తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డ‌వారికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం
Vaikuntha Darshan for those injured in the stampede

తిరుపతి: తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శి ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల జారీ స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాటలో ఆరుగురు మృతిచెంద‌గా, అనేక మంది గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈరోజు Read more

సునీతా విలియమ్స్‌ రాక మరింత ఆలస్యం
Sunita Williams arrival delayed further

న్యూఢిల్లీ: దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను భూమి మీదకు తీసుకువచ్చేందు చేపట్టిన నాసా, స్పేస్ ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ-10 Read more

Advertisements
×