పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. నటి వాణి కపూర్ తో కలిసి ‘అబీర్ గులాల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫవాద్ ఖాన్. అయితే, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ సినిమాను కేంద్రం బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే పాకిస్థాన్ నటులపై భారత్‌లో నిషేధం విధించినట్లు సమాచారం.జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్‌లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదిలావుంటే ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌కి చెందిన నటులపై భారత ప్రభుత్వం నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.అలాగే పాకిస్థాన్‌కి చెందిన నటులపై భారత్‌లో నిషేధం విధించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ మూవీ నుంచి రెండు పాటలను చిత్రయూనిట్ విడుదల చేయగా తాజాగా వాటిని యూట్యూబ్‌లో నుంచి మేకర్స్ తొలగించారు.
పాకిస్థాన్ నటుడి
అభీర్ గులాల్’ సినిమా ఈ ఏడాది మే 9న విడుదలకు సిద్ధంగా ఉంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో ఆర్తి ఎస్ బగ్దీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఈ మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేశారు. తాజాగా వాటిని కూడా యూట్యూబ్ (ఇండియా) నుంచి తొలగించారు. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పందించలేదు. పాకిస్థాన్ నటుడి సినిమా కావడంవల్ల ఈ మూవీ ప్రకటన వెలువడిన నాటి నుంచే బాయ్‌కాట్ చేయాలంటూ కొందురు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా జరిగిన ఉగ్ర దాడితో ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. అంతేకాకుండా ఈ సినిమాను ప్రోత్సహిస్తున్నందుకు బాలీవుడ్ పైన కూడా విమర్శలు మొదలయ్యాయి.పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ ఫవాద్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా బుధవారం విచారణ వ్యక్తం చేశారు. ‘పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి గురించి తెలిసి చాలా బాధపడ్డా. ఈ భయంకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా. ఇలాంటి క్లిష్టమైన సమయంలో వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా’ అని పోస్ట్ చేశారు. కాగా, ఉగ్రదాడిపై స్పందించకుండా, అదే రోజు సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్ చేశారంటూ వాణీ కపూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. అలాగే దాడిపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

పుల్వామా దాడి
పాకిస్థాన్‌కు సంబంధించిన నటీనటులు ఎవ్వరూ భారతీయ చిత్రాల్లో నటించకుండా ఉండేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సినీ కార్మికులు సంఘం(ఎఫ్డబ్యూఐసీఈ) తెలిపింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో వాళ్లని పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటిచింది. అయితే పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఈ సంఘం ఇలాంటి నిషేధాన్ని అమలు చేసింది. ఒక వేళ ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ సినిమా పరిశ్రమలో పాకిస్థాన్ వాళ్లతో కలిసి పని చేసే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read Also: Imanvi: నన్ను కళాకారిణిగా చూడండి..పాకిస్తాన్ తో నాకు సంబంధం లేదు: ఇమన్వి