సీబీఎస్‌ఈ బోర్డు 2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 12వ తరగతి పరీక్షలు రాయడానికి 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంజినీరింగ్, వైద్య విద్య లక్ష్యంగా కొంతమంది విద్యార్థులు డమ్మీ పాఠశాలల్లో చేరి కేవలం పరీక్షల కోసం మాత్రమే హాజరవుతున్నారు. దీనివల్ల అసలు తరగతులకు హాజరుకాకుండా, విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు సీబీఎస్‌ఈ ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై విద్యార్థులు పరీక్షలకు అర్హత పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి.
హాజరు తప్పనిసరి
నకిలీ స్కూళ్లకు చెక్ పెట్టేందుకు సీబీఎస్సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.విద్యార్థులు తరగతులకు రెగ్యులర్‌గా హాజరుకానకపోయిన, రిజిస్టర్లలో మాత్రం హాజరైనట్లు నమోదు చేయడం ఇకపై కుదరదు. అలాంటి వారిని తుది పరీక్షలు రాయనివ్వబోమని స్పష్టం చేసింది.వేలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్య విద్య లక్ష్యంతో కేవలం 12వ తరగతి పరీక్షలు రాసేందుకే కొంత డబ్బు ఇచ్చి డమ్మీ పాఠశాలల్లో చేరుతున్నారు. రెగ్యులర్ తరగతులకు హాజరుకాని విద్యార్థులు 12వ తరగతి బోర్డు పరీక్షలకు కూడా హాజరుకాకుండా నిషేధించడానికి 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బీసీ సంక్షేమ శాఖ
తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులకు ఆర్ధిక సాయం అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆశక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి ఓ ప్రకనలో తెలిపారు. డిగ్రీలో 60 శాతం మార్కులతోపాటు ఈ ఏడాది జులై 1 నాటికి 35 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అలాగే అభ్యర్ధుల కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని సూచించారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చని తెలిపారు.

ఆకస్మిక తనిఖీల సమయంలో పాఠశాలల రిజిస్టర్లలో హాజరైనట్లు ఉండి.. అక్కడ విద్యార్థులు లేకున్నా వారిని తుది పరీక్షలు రాయడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాంటి వారు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ద్వారా పరీక్షలు రాసుకునేలా అవకాశం కల్పించామని, అందుకు ఆ సంస్థ అధికారులతో కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే వైద్య అత్యవసర పరిస్థితులు, జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇతర తీవ్రమైన కారణాల వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బోర్డు 25 శాతం హాజరు సడలింపును అందిస్తుందని బోర్డు సభ్యులు తెలిపారు.