బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Miniter KTR)కు ఏసీబీ నోటీసులు (ACB Notices), సిరిసిల్ల క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటనపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Ex Minister ACB Notices) ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. అందాల పోటీల నిర్వహణలో విఫలమై ప్రపంచం ముందు తెలంగాణ పరువు పోగొట్టారని, కేటీఆర్ విజన్ ఖండతరాలు పాకుతుంటే ఓర్వలేకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేష్టలతో త్వరలో ప్రజల్లో తిరుగుబాటు ఖాయమని, కాంగ్రెస్ పీడను ఎప్పుడు వదిలించుకోవాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని జగదీష్ రెడ్డి అన్నారు.

ఏసీబీ విచారణకు సహకరిస్తా..
కాగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ.. తాను ఏసీబీ విచారణకు సహకరిస్తానని అన్నారు. అయితే యూకే, యూఎస్ వెళ్లేందుకు తాను ముందుగానే ప్లాన్ చేసుకున్నానని, తాను పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతానని అన్నారు.
Read Also: KTR: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు