తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET 2025) రెండో విడత నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం ప్రకటించింది. అభ్యర్థులు డిసెంబర్ 15 నుంచి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పరీక్షలు జనవరి 3 నుండి 31 మధ్య ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి. మొత్తం పరీక్ష 150 మార్కులకు జరుగుతుంది. సమాచార పత్రాన్ని డిసెంబర్ 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ www.scooledu.telangana.gov.in ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని టెట్ ఛైర్మన్, పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు.
Read Also: AP: ఈనెల 17న పార్వతీపురం లో జాబ్ మేళా

సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయులకూ TET తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో మొదటి విడత పరీక్ష జూన్‌లో జరగనుంది. తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తోన్న ఉపాధ్యాయులు తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే వచ్చే రెండు సంవత్సరాల్లో టెట్ పాస్ కావాలని సెప్టెంబర్ 1న కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు ఉపాధ్యాయ సంఘాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ను కూడా దాఖలు చేశాయి.
బీఈడీ-ఎస్‌జీటీ అభ్యర్థుల సందిగ్ధతకు పరిష్కారం
గతంలో బీఈడీ అర్హతతో ఎస్‌జీటీలకు నియామకం జరిగినప్పటికీ, ప్రస్తుతం డీఈడీ అర్హత తప్పనిసరి. దీంతో బీఈడీతో పనిచేస్తున్న ఎస్‌జీటీలు పేపర్-1 రాయాలా? పేపర్-2 రాయాలా? అనే సందేహం కలిగింది.
ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది:
- ఇన్ సర్వీస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు
- ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు
అందరూ TET రాయొచ్చని తెలిపింది.
అదేవిధంగా బీఈడీ అర్హతతో ఎస్‌జీటీలుగా పని చేస్తున్న వారు పేపర్-1 రాయొచ్చని విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన సవరణ జీఓ ద్వారా ప్రకటించారు.
ఉపాధ్యాయ నియామకాల్లో TET ప్రాధాన్యత
విద్యా హక్కు చట్టం ప్రకారం, ఉపాధ్యాయ నియామకాలకు TET తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న NCET ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మాత్రం మినహాయింపులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో, ఆపై తెలంగాణ ఏర్పడిన తరువాత 2017లో, అలాగే 2024లో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: