తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది. కాలేజీలకు చెల్లించాల్సి ఉన్న పెండింగ్ స్కాలర్‌షిప్(Scholarship) నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 2,813 జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన రూ.161 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖకు సూచించారు.
Read Also: EPFO: మరో కీలక మార్పు: బేసిక్ శాలరీ లిమిట్ రూ.25,000కి పెంపు దిశగా

ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖతో జరిగిన సమీక్షలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు స్కాలర్‌షిప్(Scholarship) పేరుతో బకాయిలుగా రూ.161 కోట్లు ఉన్నట్టు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఆర్థికభారం పడకుండా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్టు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
కొన్నాళ్లుగా స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోసం కాలేజీల యాజమాన్యాలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నవంబర్ ప్రారంభంలో వారు ఇచ్చిన బంద్ నోటీసు తర్వాత ప్రభుత్వం చర్చలు జరిపి, బకాయిలను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఇప్పుడు నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థలో అవసరమైన మార్పులపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యా రంగ నిపుణులతో కూడిన ఈ కమిటీ, విద్యార్థులు–కాలేజీలకు ప్రయోజనం కలిగే విధంగా పలు సంస్కరణలను రూపొందించనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: