NIRF ర్యాంకింగ్స్ 2025: గత సంవత్సరంతో పోలిస్తే భారత టాప్ కాలేజీల్లో మార్పులు
NIRF ర్యాంకింగ్స్ 2025 : భారతదేశంలో టాప్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల ఎంపికకు మార్గనిర్దేశం చేస్తూ, విద్యాశాఖ సెప్టెంబర్ 4న NIRF ర్యాంకింగ్స్ 2025 విడుదల చేసింది. ఇంజినీరింగ్, మెడిసిన్, డెంటల్, ఫార్మసీ మరియు సమగ్ర విభాగాల్లో ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఎంపికయ్యాయి.
హిందూ కాలేజ్ మరియు మిరాండా హౌస్ మళ్లీ టాప్ రెండు స్థానాల్లో కొనసాగాయి.
NIRF ర్యాంకింగ్స్‌లో కాలేజీలను అనేక అంశాల ఆధారంగా అంచనా వేస్తారు – రీసోర్సులు, విద్యార్థుల సంఖ్య, రీసెర్చ్ పబ్లికేషన్ల నాణ్యత, గ్రాడ్యుయేట్ల సంఖ్య, మరియు ఎంప్లాయర్ల వద్ద ఆ విద్యాసంస్థ ప్రతిష్ట వంటి అంశాలు.
ఈ ఏడాది, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు అత్యధిక టాప్ కాలేజీలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ దేశంలోనే ఉత్తమ కాలేజీలకు హబ్‌గా నిలిచింది.
గత సంవత్సరం (2024)తో పోలిస్తే కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కిరోరి మల్ కాలేజ్ 2024లో 9వ స్థానంలో ఉండగా, ఈసారి టాప్ 4లోకి ఎగబాకింది. మరోవైపు, రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటినరీ కాలేజ్ మూడు స్థానాలు పడిపోయింది. PSGR కృష్ణమ్మాళ్ కాలేజ్ ఫర్ ఉమెన్ టాప్ 10లో నిలబడగా, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కొన్ని స్థానాలు కోల్పోయింది.
Top 10 Colleges in India – NIRF 2025
| Rank | College Name | State | Score |
|---|---|---|---|
| 1 | Hindu College | Delhi | 84.01 |
| 2 | Miranda House | Delhi | 83.20 |
| 3 | Hans Raj College | Delhi | 81.75 |
| 4 | Kirori Mal College | Delhi | 80.33 |
| 5 | St. Stephen’s College | Delhi | 79.41 |
| 6 | Rama Krishna Mission Vivekananda Centenary College | West Bengal | 76.74 |
| 7 | Atma Ram Sanatan Dharm College | Delhi | 76.09 |
| 8 | St. Xavier’s College | West Bengal | 76.07 |
| 9 | PSGR Krishnammal College for Women | Tamil Nadu | 75.52 |
| 10 | PSG College of Arts and Science | Tamil Nadu | 73.15 |