కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) వ్యవస్థలో ముఖ్యమైన మార్పు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం EPFలో బేసిక్ శాలరీ పరిమితి రూ.15,000గా ఉండగా, దాన్ని రూ.25,000కి పెంచే ప్రతిపాదనపై ఆలోచన జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు. చాలా కాలంగా కార్మిక సంఘాలు కూడా ఈ పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read Also: AP TET: ఈ నెల 23తో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు

పరిమితి పెంచినట్లయితే సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు అదనంగా EPF, EPS పరిధిలోకి వస్తారని అంచనా. బేసిక్ శాలరీ లిమిట్ పెరగడం వల్ల ఉద్యోగులు EPFలో ఎక్కువ మొత్తాన్ని సేవ్ చేయగలరు. ప్రస్తుతం ఉద్యోగి జీతంలో 12% EPFకు వెళుతుండగా, ఎంప్లాయర్ కూడా 12% చెల్లిస్తారు. అందులో 8.33% EPSలోకి, 3.67% EPFలోకి వెళ్తుంది. బేసిక్ వేతనం పెరగడం వల్ల ఉద్యోగి EPF, పెన్షన్ కన్ట్రిబ్యూషన్ స్వయంగా పెరుగుతుంది.
ఈ మార్పుతో ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు:
- ఎక్కువ పెన్షన్ అర్హత
- EPFపై పెరిగిన వడ్డీ ఆదాయం
- ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కూడా పెరగడం
- అధిక ఆర్థిక భద్రత
ఇప్పటి వరకు రూ.15,000 కంటే పైగా బేసిక్ వేతనం పొందుతున్నవారికి EPF, EPS తప్పనిసరి కాకపోవడంతో అనేక మంది వాటిలో చేరకుండా ఉండేవారు. కొత్త లిమిట్ అమల్లోకి వస్తే రూ.15,000–25,000 బేసిక్ వేతనం పొందుతున్న ఉద్యోగులు కూడా తప్పనిసరిగా EPF–EPS పరిధిలోకి వస్తారు. నగరాల్లో మధ్యతరగతి ఉద్యోగులు ఎక్కువగా ఉండడం, వారికి భద్రత కల్పించడం కోసం కార్మిక సంఘాలు ఈ పెంపుని దీర్ఘకాలంగా కోరుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: