AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫలితాలను ఈ వారంలోనే విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారాన్ని అనుసరించి ఈ నెల 18న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తప్పితే ఆ మరుసటి రోజైనా ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికి లభించిన సమాచారం మేరకు ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలు ఒక్క రోజే విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు జరిగాయి..
Read also: TG DOST Notification:డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!

AP Inter Results 2026 Release Update
AP Inter Results 2026: ఈ వారంలోనే ఏపీ ఇంటర్ ఫలితాలు
ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. దీంతో మూల్యాంకనం పూర్తి కావడంతో కొద్దిగా ఆలస్యమైంది. తాజాగా ఈ ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాలను అతి త్వరలోనే ప్రకటించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మూల్యాంకనం పూర్తవడంతో ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రాసెస్ ఈనెల 16వ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఏపీ ఇంటర్ ఫలితాలతో పాటు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈనాడు.నెట్లో ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 18 లేదా 19వ తేదీల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: