ఐపీఎల్ 2025 సీజన్‌లో ముల్లాన్‌పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో పిచ్‌పై పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా కేకేఆర్ 95 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఇరు జట్ల స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకున్న పోరులో కింగ్స్ నిర్దేశించిన 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 పరుగులకే చేతులెత్తేయడంతో పంజాబ్ 16 పరుగుల తేడాతో గెలిచింది.రఘువంశీ (28 బంతుల్లో 37, 5 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రీ రస్సెల్ (17) పోరాడారు. పంజాబ్ స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ (4/28), యాన్సెన్ (3/17) కేకేఆర్‌ను దెబ్బతీశారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్ (15 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. హర్షిత్ రాణా (3/25) ఆరంభంలోనే కింగ్స్‌ను దెబ్బతీయగా మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (2/14), వరుణ్ చక్రవర్తి (2/21) కలిసి మిడిల్, లోయరార్డర్ పనిపట్టారు.
బాధ్యత తీసుకుంటాను
ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఔట్ అవ్వడంపై కెప్టెన్ అజింక్యా రహానే నిరాశను వ్యక్తం చేశారు. పంజాబ్ కింగ్స్ 111 పరుగుల స్కోరును డిఫెండ్ చేసి, కేకేఆర్‌ను 95 పరుగులకే ఆలౌట్ చేయడంపై రహానే మాట్లాడుతూ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి తానే బాధ్యత వహిస్తానని అన్నాడు. “చెప్పడానికి ఏమీ లేదు. జరిగినదంతా అందరం చూశాం. ప్రయత్నించినప్పటికీ ఓటమిచెందడనం ఎంతో నిరాశగా ఉంది. ఈ ఓటమికి నేనే బాధ్యత తీసుకుంటాను. తప్పు షాట్ ఆడాను. అయినప్పటికీ బంతి స్టంప్స్‌ను తాకలేదు. ఎల్బీడబ్ల్యూ తర్వాత అంగ్‌క్రిష్‌తో మాట్లాడినప్పుడు, అంపైర్ కాల్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. కానీ నేను ఆ సమయంలో అవకాశం తీసుకునేందుకు సిద్ధంగా లేను అని అజింక్యా రహానేతెలిపారు.

స్వీప్ షాట్
మేము బ్యాటింగ్ చెత్తగా చేశాం. పూర్తి బాధ్యత మేం వహిస్తాం. బౌలర్లు నిజంగా అద్భుతం చేశారు. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ను 111 కే కట్టడి చేశారు. ఈ వికెట్‌పై స్వీప్ షాట్ ఆడడం కష్టంగా ఉంది. ఫుల్ ఫేస్‌తో బ్యాటింగ్ చేయడం బెటర్. ఇంటెంట్ కొనసాగాలి కానీ క్రికెట్ షాట్స్ ఆడాలి. అయినా ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇది మాకు సులభమైన ఛేధన అనుకున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత, నన్ను నేను కామ్ గా ఉంచుకుని,జట్టుతో ఏం మాట్లాడాలనేది ఆలోచించాలి. ఇంకా టోర్నమెంట్ లో చాలా మ్యాచులు మిగిలి ఉన్నాయి. తప్పుల్ని సరి చేసుకుని, ముందుకు సాగాలి,” అని పేర్కొన్నాడు.
Read Also:IPL 2025: పంత్ ను అంత మాట అనేశారేంటి