ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని తీవ్ర హెచ్చరిక

Donald Trump: ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని తీవ్ర హెచ్చరిక

కెనడా నూతన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చారు. కెనడాని అమెకాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదని… పొరపాటున కూడా ఆ ఆలోచన చేయవద్దని చెప్పారు. కెనడా నూతన ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

Advertisements

అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తాం

ట్రంప్ కెనడాను అమెరికాలో విలీనం చేయాలని సూచించిన నేపథ్యంలో, కార్నీ ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించారు.కెనడాపై అమెరికా గౌరవం చూపించాలని… అంతవరకు అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తామని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడా సార్వభౌమాధికారం పట్ల గౌరవం చూపితేనే తాను ట్రంప్ ను కలుస్తానని చెప్పారు. మరోవైపు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ తెలిపిన వివరాల ప్రకారం… కార్నీ-ట్రంప్ మధ్య చర్చలు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

కెనడా-అమెరికా సంబంధాలు

కెనడా-అమెరికా మధ్య వాణిజ్య, భద్రతా, సాంస్కృతిక సంబంధాలు ఉన్నప్పటికీ, రెండు దేశాలు తమ స్వతంత్రతను కాపాడుకోవడంలో నిబద్ధంగా ఉన్నాయి. కెనడా ప్రజలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలనే అభిలాషతో ఉన్నారు.

Related Posts
ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు ఎంతో తెలుసా..?
literacy rate AP

ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు 67.5% గా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోకసభలో జరిగిన సమావేశంలో వైసీపీ ఎంపీ తనూజారాణి అడిగిన ప్రశ్నకు, కేంద్ర మంత్రి జయంత్ Read more

హైదరాబాద్‌లో పావురాల రేసింగ్ పోటీలు!
హైదరాబాద్ లో పావురాల రేసింగ్ పోటీలు!1

హైదరాబాదులో పావురం క్రీడలు, ముఖ్యంగా పావురం రేసింగ్, పెద్దగా ప్రాచుర్యం పొందాయి. ఈ రేసింగ్‌లో పక్షులను వారి ఇంటి నుండి వంద కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్లి, అక్కడి Read more

Asif Ali Zardari: క్షీణించిన అసిఫ్ అలీ జర్దారీ ఆరోగ్యం..ఆస్ప‌త్రిలో చేరిక
క్షీణించిన అసిఫ్ అలీ జర్దారీ ఆరోగ్యం..ఆస్ప‌త్రిలో చేరిక

పాకిస్థాన్ అధ్య‌క్షుడు అసిఫ్ అలీ జ‌ర్దారి ఆరోగ్యం క్షీణించింది. క‌రాచీలోని ప్రైవేటు ఆస్ప‌త్రిలో ఆయ‌న్ను చేర్పించారు. ఏప్రిల్ ఒక‌టో తేదీన ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు మీడియా ద్వారా Read more

హైదరాబాద్‌లో వేయి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్‌లో వేయి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఈ ఏడాది నగరంలోని అన్ని ప్రధాన, ముఖ్యమైన మార్గాల్లో దాదాపు 1,000 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని యోచిస్తోంది. అధికారుల Read more

×