ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కువ మంది సేవించే పానీయాల్లో కాఫీ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా విదేశీయులు టీ కంటే కాఫీనే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే సాధారణ కాఫీ కాకుండా ఎక్కువగా బ్లాక్ కాఫీ (Black Coffee) ని ఎంచుకుంటారు. చక్కెర లేకుండా కేవలం కాఫీ డికాక్షన్ను మాత్రమే తాగితే దానిని బ్లాక్ కాఫీ అంటారు. కొంతమంది రుచి కోసం తేనె కలుపుతారు. ఇక తాజాగా నిపుణులు బ్లాక్ కాఫీలో నిమ్మరసం (Lemon juice in black coffee) కలిపి తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని సూచిస్తున్నారు.కాఫీలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఈ రెండు కలిసినపుడు శరీరానికి శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణ నష్టం తగ్గుతుంది. రక్తనాళాలు, గుండె కండరాల వాపులు తగ్గుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కణాల రక్షణతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.

బరువు తగ్గించడంలో అద్భుత ప్రభావం
శాస్త్రవేత్తల అధ్యయనాలు చెబుతున్నాయి – బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గవచ్చు. కారణం, ఇది శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. దీని వల్ల క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. అధిక కొవ్వు కరుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. తినే ఆహారం పరిమితమవుతుంది. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది. అలాగే డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి శరీరానికి బలమైన రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. దీనివల్ల సీజనల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. అదనంగా, ఆహారంలో ఉన్న ఐరన్‌ను శరీరం సులభంగా గ్రహిస్తుంది. ఫలితంగా రక్తం పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
జాగ్రత్తలు తప్పనిసరి
బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగడం వలన బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. కానీ కేవలం కాఫీ తాగడం వల్లే బరువు తగ్గుతాం అనుకోవడం పొరపాటు. సరైన ఆహారం, వ్యాయామం తోడైతేనే ఫలితాలు త్వరగా వస్తాయి. మరోవైపు అసిడిటీ సమస్య ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగరాదు. ఎందుకంటే కాఫీ, నిమ్మరసం రెండూ ఆమ్ల స్వభావం కలిగివి. వీటిని కలిపి తాగితే అసిడిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.మొత్తం మీద బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగడం రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడం నుండి బరువు తగ్గించడంలో సహాయం చేయడం వరకు దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సరైన పరిమాణంలో మాత్రమే తాగాలి. అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే ఈ మిశ్రమం ఆరోగ్యకరమైన సహచరంగా నిలుస్తుంది.
Read Also :