తెలంగాణ సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ (Special Commissioner) గా, సి.హెచ్. ప్రియాంక ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమెకు అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రియాంక (C.H. Priyanka) ను తాజాగా ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు నియమించింది. సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా ఉన్న డా. హరీష్ ను తెలంగాణ జెన్కో ఎం.డి గా బదిలీచేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ గాఉన్న సి.హెచ్. ప్రియాంక ను సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
భాద్యతలను స్వీకరించారు
నేడు ఉదయం సచివాలయంలో డా, హరీష్ నుండి, ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ తోపాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. గా భాద్యతలను స్వీకరించారు.స్పెషల్ కమీషనర్ గా భద్యతలు స్వీకరించిన ప్రియాంక కు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎం.డి గా వెళ్లిన డా. హరీష్ (Dr. Harish) కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు.
అధికారులు
ఈ సందర్భంగా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్న అధికారులు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు ప్రియాంకను అభినందించారు. ఆమె నేతృత్వంలో శాఖ, మరింత ప్రగతిపథంలో సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే, డా, హరీష్ ఆయన గత నాలుగేళ్లలో సమాచార శాఖలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాత్మక పనితీరును అధికారులు ప్రశంసించారు.
Read Also: Karimnagar: ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్