ప్రముఖ ఎడుటెక్ సంస్థ బైజూస్(BYJU’S )కు తాజాగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ ప్లేస్టోర్ (google play store) నుంచి బైజూస్ లెర్నింగ్ యాప్‌ను తొలగించారు. ఈ చర్యకు కారణం, బైజూస్ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)కు బకాయిలు చెల్లించకపోవడమేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బకాయిల చెల్లింపుల్లో విఫలమైనందుకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
థింక్ అండ్ లెర్న్ యాప్‌లు యథావిధిగా
గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగింపుపై స్పష్టత ఇచ్చిన సంస్థ ప్రతినిధులు, బైజూస్ బ్రాండ్ కింద ఉన్న ‘థింక్ అండ్ లెర్న్’ యాప్‌లు యధావిధిగా పనిచేస్తాయని తెలిపారు. అలాగే యాపిల్ యాప్ స్టోర్‌లో బైజూస్ యాప్ ఇప్పటికీ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. యాప్ తొలగింపు విద్యార్థులపై తాత్కాలిక ప్రభావం చూపొచ్చన్నా, సంస్థ సేవలు కొన్ని మార్గాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం.
ఒకప్పుడు విలువైన స్టార్టప్ – ఇప్పుడు సంక్షోభంలో
ఒకప్పుడు $22 బిలియన్ విలువ కలిగిన భారత్‌కి చెందిన అతిపెద్ద ఎడుటెక్ కంపెనీగా గుర్తింపు పొందిన బైజూస్, గత కొంత కాలంగా వివాదాల్లో చిక్కుకుని పతన దిశగా వెళ్తోంది. పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోవడం, బకాయిలు చెల్లించకపోవడం, ఉద్యోగుల తొలగింపులు, లాయర్ల జోక్యం వంటి అంశాలతో సంస్థ తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉంది. తాజా ప్లేస్టోర్ నుంచి యాప్ తొలగింపుతో సంస్థ భవిష్యత్తుపై మరింత అనిశ్చితి నెలకొంది.
Read Also : Abhilasham: ఓటీటీలోకి మలయాళం ‘అభిలాషం’