భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. తాజాగా అమెరికా దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లా త్వరలో ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ తరుణంలో టెస్లాకు ప్రపంచ పోటీదారిగా ఉన్న చైనా కంపెనీ BYD భారతదేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోతోంది. దింతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీగా టెస్లాకు గట్టి పోటీ ఇవ్వనుంది.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు టెస్లా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కార్ల అమ్మకాల సంస్థ. అయితే, BYD ఇప్పుడు టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అంతర్జాతీయ మార్కెట్ల తర్వాత ఈ రెండు ఎలక్ట్రిక్ దిగ్గజాలు ఇప్పుడు భారతదేశంలోనూ ఢీకొనబోతున్నాయి. BYD ప్రస్తుతం భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది – ఆటో 3, సీల్ అండ్ eMax 7 . ఈ కంపెనీ తాజాగా మొదటి ఎలక్ట్రిక్ కారు సీలాయన్ 7 మోడల్‌ను లాంచ్ చేసింది. దీనితో పాటు చాల ఇతర BYD కార్లు కూడా ఇండియాకి వస్తున్నాయి.

తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లు
ప్రపంచ మార్కెట్తో సహా ఇండియాలో కూడా తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త సమాచారం విడుదల అయ్యింది. BYD హైదరాబాద్‌లో దాదాపు రూ.85,000 కోట్ల పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీని నిర్మించాలని యోచిస్తోంది.
మారుతి,టాటా, మహీంద్రాలకు భారీ సవాలు
BYD ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కాకుండా, వాటికి బ్యాటరీలను కూడా తయారు చేయడానికి ఒక ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ తయారీ ప్లాంట్ టెస్లాకే కాకుండా టాటా, మహీంద్రా వంటి భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇంకా భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతికి కూడా భారీ సవాలును విసురుతుంది.