తెలంగాణలో వర్షాకాల వ్యవసాయానికి నాట్లు జరుగుతున్న సమయంలో, యూరియా కొరత (Urea deficiency) రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. వరంగల్ (Warangal) జిల్లాలో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బుధరావుపేటలో రైతుల ఆందోళన
వరంగల్ (Warangal) జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట (Budharaopet) పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా అందకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చున్నా, ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా యూరియా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా కోసం రాస్తారోకో
రాష్ట్రంలో చాలాచోట్ల యూరియా అందక రైతులు రాస్తారోకోలకు దిగుతున్నారు. విత్తనాలు వేసిన తర్వాత సమయానికి ఎరువులు అందకపోవడం వల్ల పంట నష్టానికి గురవుతుందన్న ఆందోళన రైతుల్లో ఉంది. అధికారులు సమర్థవంతంగా ప్రణాళికలు వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“నాట్లు వేయమన్నారు..ఎరువులు మాత్రం లేవు”
“సాగునీరు, ఎరువులు సమయానికి అందుతాయంటూ మమ్మల్ని నాట్లు వేయమన్నారు. ఇప్పుడు ఎరువుల కోసం రోడ్డుపై పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా వ్యవసాయం ఎలా సాగించాలి?” అంటూ రైతులు వాపోతున్నారు. యూరియా సరైన సమయానికి అందించడం చేతకానప్పుడు నాట్లు ముందుగా వెయ్యమని ఎందుకు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: