हिन्दी | Epaper

UPI: యూపీఐ లావాదేవీలు ఇకపై మరింత వేగంగా

Sharanya
UPI: యూపీఐ లావాదేవీలు ఇకపై మరింత వేగంగా

భారతదేశంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక అడుగు వేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చేసే లావాదేవీలను మరింత వేగవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. జూన్ 16, 2025 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.

లావాదేవీ వేగం పెరుగుతోందా?

ప్రస్తుతం యూపీఐ ద్వారా డబ్బులు పంపినపుడు, లేదా QR కోడ్ స్కాన్ చేసి చెల్లించినపుడు ‘సక్సెస్‌ఫుల్‌ ట్రాన్సాక్షన్’ మెసేజ్ వచ్చే వరకు కొన్ని సెకన్ల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ సమయం మరీ ఎక్కువగా ఉండటంతో, వినియోగదారులకు అసౌకర్యం కలుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌పీసీఐ కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, యూపీఐ లావాదేవీల రిస్పాన్స్ టైం దాదాపు 50% వరకు తగ్గనుంది. ఎన్‌పీసీఐ తాజా ఆదేశాల ప్రకారం క్రెడిట్/డెబిట్‌కు సంబంధించిన లావాదేవీలు కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతాయి. ప్రస్తుతం దీనికి 30 సెకన్లు పడుతోంది. అంతేగాక‌ ట్రాన్సాక్షన్ స్టేటస్ తెలుసుకోవడం, విఫలమైన లావాదేవీల రివర్సల్, చిరునామా ధ్రువీకరణ వంటి ప్రక్రియలు కూడా 30 సెకన్ల నుంచి కేవలం 10 సెకన్లకు తగ్గనున్నాయి.

ఈ మార్పులు 2025 జూన్ 16 నుంచి అధికారికంగా అమలులోకి రానున్నాయి. తద్వారా, యూపీఐ లావాదేవీల వేగం, నాణ్యత, విశ్వసనీయత మరింత మెరుగవుతుంది. NPCI ఈ మార్పుల అమలుకు సంబంధించి అన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు పేటీఎం, ఫోన్‌పే వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులు జూన్ 16 నాటికి రెస్పాన్స్ స‌మ‌యం త‌గ్గేందుకు తమ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

Read also: Gold : బంగారం ధరలు తగ్గడానికి కారణాలు..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వంట గ్యాస్ కొరతతో పెరిగిన ఫుడ్ ఐటెమ్స్ ధరలు

వంట గ్యాస్ కొరతతో పెరిగిన ఫుడ్ ఐటెమ్స్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు!

వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు!

ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం: రేపటి నుంచే అదనపు చార్జీలు

ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం: రేపటి నుంచే అదనపు చార్జీలు

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై సిగ్మా పట్టు

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై సిగ్మా పట్టు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

📢 For Advertisement Booking: 98481 12870