UIDAI : ఈ రోజుల్లో ప్రభుత్వ సేవలు, సబ్సిడీలు, కొత్త సిమ్ కార్డ్ పొందాలన్నా ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. మీ ఆధార్ కార్డు అనధికారంగా ఉపయోగించబడుతుందేమో అనే అనుమానం కలిగితే వెంటనే తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం MyAadhaar అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
Read Also: Budget 2026: ఆదాయం పెరిగి.. పన్నులు తగ్గుతాయా?

ఆధార్ మిస్‌యూజ్ నుంచి తప్పించుకునే సులభ మార్గాలు
అందులో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా లాగిన్ అవ్వాలి. అనంతరం ‘Authentication History’ అనే ఆప్షన్‌ను ఎంచుకుని, తేదీ వారీగా మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారో పరిశీలించవచ్చు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా UIDAI కి ఫిర్యాదు చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆధార్ భద్రతపై UIDAI సూచనలు
భద్రత కోసమే కాకుండా, అవసరం లేని సందర్భాల్లో ఆధార్ వాడకాన్ని పరిమితం చేయడం కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఆధార్ వివరాలను అడిగితే జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా, MyAadhaar పోర్టల్ ద్వారా బయోమెట్రిక్ లాకింగ్ ఆప్షన్‌ను ఆన్ చేయడం వల్ల ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్ ద్వారా జరిగే దుర్వినియోగాన్ని నివారించవచ్చు. ఈ చిన్న జాగ్రత్తలు భవిష్యత్తులో పెద్ద సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: